Song Details
Lyrics
ఊపిరొచ్చిన బాపు బొమ్మ నేలకొచ్చిన నెలవంకమ్మ ఊపిరొచ్చిన బాపు బొమ్మ నేలకొచ్చిన నెలవంకమ్మ ఇంతవరకు ఏ రవివర్మ చూపలేదే ఈ చిరునామా నవ్వుతుంటే ఈ మణిపూస చిన్నబోద మోనాలిసా ఆ ఊపిరొచ్చిన బాపు బొమ్మ నేలకొచ్చిన నెలవంకమ్మా మెరిసే సింగారం మేలిమి బంగారం ఏ మానస సరోవరంలో స్నానం చేస్తుందో ఓ...ఓ...ఓ...ఓ... నీ తియ్యనిస్నేహం తాకినదా దేహం నీ తుంటరి తలపుల తడితో తళ తళ లాడినదో ఓ...ఓ...ఓ...ఓ... నిన్నుచూసి కంటిరెప్ప వెయ్యలేనుగా తల్లడిల్లిపోయే గుండె ఊపిరాడక కవితలా నన్నల్లే శ్వాస కాళిదాసౌతుంటే చూశా ఆ ఊపిరొచ్చిన బాపు బొమ్మ నేలకొచ్చిన నెలవంకమ్మా నీలో నా ప్రాణం కొలువుందో ఏమో నీ వైపే పరుగెడుతోంది నిలవని నా పాదం ఓ...ఓ...ఓ...ఓ... నాలోని రూపం వెలిగిందో ఏమో నావైపే రానంటోంది నడిరాతిరి పాపం ఓ...ఓ...ఓ...ఓ... కళ్ళముందు ముచ్చటైన జంట ఉండగా కాలమంత ఆగిపోదా కాలు సాగక నడిసివచ్చే మెరుపుని చూశా నిన్ను తాకి నిలువున మెరిశా ఊపిరొచ్చిన బాపు బొమ్మ నేలకొచ్చిన నెలవంకమ్మ ఇంతవరకు ఏ రవివర్మ చూపలేదే ఈ చిరునామా నవ్వుతుంటే ఈ మణిపూస చిన్నబోద మోనాలిసా
Lyrics sourced from public databases. May contain errors.