Song Details
Lyrics
పల్లవి: మల్లెల పానుపు ఉంది...చల్లని జాబిలి ఉంది నీ కోసమా నా కోసమా... నీ కోసమా నా కోసమా...కాదోయి కాదు మన కోసమే చరణం: 1 నీ జోడుగా నేనుంటానని...నీ జోడుగా నేనుంటానని నీ నీడలో మేడ కడతానని..అన్నాను కాదా ఆనాడే అది తీరలేదా ఈనాడే...ఏ..ఏ.. మల్లెల పానుపు ఉంది...చల్లని జాబిలి ఉంది నీ కోసమా నా కోసమా... నీ కోసమా నా కోసమా...కాదోయి కాదు మన కోసమే చరణం: 2 అందాల గంధాలు అందించనా...అందాల గంధాలు అందించనా పరువాల పన్నీరు చిందించనా... కనరానిదోయి ఈ హాయి...మనసైన దోయి ఈ రేయి మల్లెల పానుపు ఉంది...చల్లని జాబిలి ఉంది నీ కోసమా నా కోసమా... నీ కోసమా నా కోసమా...కాదోయి కాదు మన కోసమే...
Lyrics sourced from public databases. May contain errors.