MovieGQ

Palarathi Mandhirana

Nenu Manishine (1971) · Track 6 of 6

Song Details

Lyrics

పల్లవి: పాలరాతి మందిరాన పడతిబోమ్మ అందం అనురాగ గీతిలోన అచ్చ తెలుగు అందం పాలరాతి మందిరాన పడతిబోమ్మ అందం... చరణం: 1 రతనాల కోట ఉంది రాచకన్నె లేదు రంగైన తోట ఉంది రామచిలుక లేదు ఆ రాచ కన్నెవు నీవై అలరిస్తే అందం నా రామచిలుకవు నీవై నవ్వితే అందం పాలరాతి మందిరానా పడతిబోమ్మ అందం... పాలరాతి మందిరానా పడతిబోమ్మ అందం... చరణం: 2 కన్నెమనసు ఏనాడూ సన్నజాజి తీగ... తోడు లేని మరునాడూ.. వాడి పోవు కాదా ఆ తీగకు పందిరి నీవై అందుకుంటే అందం... ఆ కన్నెకు తోడుగ నిలిచి అల్లుకుంటే అందం... పాలరాతి మందిరాన పడతిబోమ్మ అందం అనురాగ గీతిలోన అచ్చ తెలుగు అందం పాలరాతి మందిరాన పడతిబోమ్మ అందం... చరణం: 3 నీ సోగకన్నుల పైనా బాస చేసినాను నిండు మనసు కోవెలలోనా నిన్ను దాచినాను... ఇరువురిని ఏకం చేసే ఈ రాగబంధం ... ఎన్నెన్ని జన్మలకైనా చెరిగి పోని అందం... చెలుని వలపు నింపుకున్న చెలియ బ్రతుకు అందం... అనురాగ గీతిలోనా అచ్చ తెలుగు అందం..లా.ల.లా..ల

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Nenu Manishine

See All