Song Details
Lyrics
వెన్నెలా…. ఓ వెన్నెలా నా నీడై నడిచే నేస్తం నువ్వయ్యావెలా నిన్నలా… నే లేనుగా ఈ రోజే చూస్తున్నాగా నన్నే కొత్తగా.. ఓ ఓ ప్రాణం కదిలించిందే నీ స్వరం అడుగేస్తూ నాతో వచ్చే స్నేహం, నీ వరం ఒక మాయ నీ పరిచయం … ఓ ఓ ఓ ఓ వెన్నెలా…. ఓ వెన్నెలా నా నీడై నడిచే నేస్తం నువ్వయ్యావెలా నిన్నలా… నే లేనుగా ఈ రోజే చూస్తున్నాగా నన్నే కొత్తగా.. మాటే విననీ మనసెగిరిపోనీ చెలిమే రెక్కలివ్వగా నీకే తెలియదంటున్న నిజమే లోకం చూడగా సందేహం వీడనీ ఈ మాయే మదిలో నిండనీ సంతోషం పొంగనీ నీ హృదయం నీలో లేదనీ ఓ మాటల్లోనే, మోమాటం కరిగించి నిన్నూ నన్నూ స్నేహం పెనవేసింది అలావాటే లేదుగా అడిగేది కాదుగా ఈ వింతల వేడుక చెలిమికి ఋజువేగా ఎన్నో ఊహల్లో మన ఉనికే వెతికానే నువ్వే ఎదురైతే ఆ ఏకాంతంలో నాలో మౌనం మోగదే వెన్నెలా…. ఓ వెన్నెలా నా నీడై నడిచే నేస్తం నువ్వయ్యావెలా నిన్నలా… నే లేనుగా ఈ రోజే చూస్తున్నాగా నన్నే కొత్తగా.. ఓ ఓ ఏ చోటున్నా నను నీలో చూస్తున్నా నువులేవన్నా తలపే చెరిపేస్తున్నా అడుగడుగే చీకటై నిశిలో ముంచేసినా నీ రాకే వేకువై నను నడిపెను ప్రేమా నీతో క్షణకాలం కలకాలంలా ఉందే అందం ఆనందం కలగలిపి చూపిస్తున్నా అద్దం మన కథే! వెన్నెలా…. ఓ వెన్నెలా నా నీడై నడిచే నేస్తం నువ్వయ్యావెలా నిన్నలా… నే లేనుగా ఈ రోజే చూస్తున్నాగా నన్నే కొత్తగా.. ఓ ఓ ప్రాణం కదిలించిందే నీ స్వరం అడుగేస్తూ నాతో వచ్చే స్నేహం, నీ వరం ఒక మాయ నీ పరిచయం … ఓ ఓ ఓ ఓ వెన్నెలా.
Lyrics sourced from public databases. May contain errors.