MovieGQ

Swasallo Swasalle

Nee Thodu Kavali (2002) · Track 7 of 9

Song Details

Lyrics

శ్వాసల్లో శ్వాసల్లే ఆశల్లో ఆశల్లే నీడల్లో తోడల్లే నా గుండె జోరల్లే ఓ చెలి నిన్ను నేను నాకు సొంతమనుకున్నాను వసంతమై నడుచుకుంటు నీవు వస్తుంటే సాగరాన ఎగసే అలవై దోబూచులాడేవో కడలికి కన్నీటిని తరలించీ దప్పిక నా మనసుకు మిగిలించి ఓ ప్రియా నా ప్రియ నను విడిచి పోయావే నీ గమ్యం నీదంటు ఎదగాయం చూశావే ఓ ప్రియా నా ప్రియ నను విడిచి పోయావే నీ గమ్యం నీదంటు ఎదగాయం చూశావే వాలిపోయిన పొద్దులు ఓ దీపమల్లే వెలిగి రాలిపోయిన ఆశలన్ని రేపిపోయినావే మోయలేని ఓ పూలకొమ్మకు జీవమంటు పోసి ప్రాణమిచ్చిన ఆ చిట్టి రెమ్మకు ధ్యానమయ్యినావే బ్రతుకే పచ్చతోరణములా ప్రేమ సాగరములా మర్చివేసి నను విడిచిపోయినావే నీడలా నడిచి రావాలని నాకు నీ తోడు కావాలని నీడలా నడిచి రావాలని నాకు నీ తోడు కావాలని అనుకుంటే ఓ ప్రియ నను విడిచి పోయావే నీ గమ్యం నీదంటు ఎదగాయం చూశావే ఓ ప్రియా నా ప్రియ నను విడిచి పోయావే నీ గమ్యం నీదంటు ఎదగాయం చూశావే రాతికైన నేర్పించుకుంటే మాట పలుకుతుందే కాటి నైన బ్రతిమాలుకుంటే మంటలార్పుతుండే ఏ నాటికైన సరిదిద్దుకుంటే రాత మారుతుందే ప్రేమలోన పడిపోయినాకే మనసు మారుతుందే మనసే చంపుకోని నేను మరచిపోయి నిన్ను అడుగు తీసి అడుగేసి కదులుతుంటే దూరమని నేను వెళ్తువుంటే దగ్గరగ మనసు లాగుతుంటే దూరమని నేను వెళ్తువుంటే దగ్గరగ మనసు లాగుతుంటే ఓ ప్రియా నా ప్రియ నను విడిచి పోయావే నీ గమ్యం నీదంటు ఎదగాయం చూశావే ఓ ప్రియా నా ప్రియ నను విడిచి పోయావే నీ గమ్యం నీదంటు ఎదగాయం చూశావే ఓ చెలి నిన్ను నేను నాకు సొంతమనుకున్నాను వసంతమై నడుచుకుంటు నీవు వస్తుంటే సాగరాన ఎగసే అలవై దోబూచులాడేవో కడలికి కన్నీటిని తరలించీ దప్పిక నా మనసుకు మిగిలించి ఓ ప్రియా నా ప్రియ నను విడిచి పోయావే నీ గమ్యం నీదంటు ఎదగాయం చూశావే ఓ ప్రియా నా ప్రియ నను విడిచి పోయావే నీ గమ్యం నీదంటు ఎదగాయం చూశావే

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Nee Thodu Kavali

See All