Song Details
Lyrics
ఇలా చూడు అరచేత వాలింది ఆకాశం ఇదేనాడు అనుకోని అనురాగ సందేశం ఈ అనుభవం వెన్నెల వర్షం ఎలా తెలపటం ఈ సంతోషం ఓ హాని - ఐ లవ్ యు నమ్మనంటావో ఏమో నిజమే తెలుసా అమృతం నింపే నాలో నీ చిరు స్పర్శ ఒప్పుకోలేవో ఏమో మురిసే మనసా రెప్పనే దాటిరాదే కలలో ఆశ పొద్దేరాని నిద్దర్లోనే ఉండిపోని నిన్నే చూసే కల కోసం సర్లేకాని చీకట్లోనే చేరుకోని నువ్వు కోరే అవకాశం తక్కువేం కాదులే ఈ జన్మలో ఈ వరం ఇలా చూడు అరచేత వాలింది ఆకాశం వానలా తాకగానే ఉరిమే మేఘం వీణలా మోగుతుంది యదలో రాగం స్వాగతం పాడగానే మదిలో మైకం వచ్చి ఒడి చేరుతుందా ఊహాలోకం ఉన్నట్టుండి నిన్నట్నుండి రాజయోగం దక్కినంత ఆనందం అయ్యో పాపం ఎక్కడ్లేని ప్రేమ రోగం తగ్గదేమో ఏ మాత్రం తానుగా చేరెగా ప్రియమైన ప్రేమాలయం ఇలా చూడు అరచేత వాలింది ఆకాశం ఇదేనాడు అనుకోని అనురాగ సందేశం ఈ అనుభవం వెన్నెల వర్షం ఎలా తెలపటం ఈ సంతోషం
Lyrics sourced from public databases. May contain errors.