Song Details
Lyrics
హా ఎగిరెనే మనసు సీతాకోకలాగా ఎగిరెనే ఎపుడు లేదిలాగా నువ్విచ్చిన రెక్కల వల్లేగా చుక్కల్లో విహరిస్తున్నాగా.. మెరిసెనే నా ప్రాణం వానవిల్లులాగా మెరిసెనే మైమరచిపోయేలాగా నువ్వద్దిన రంగుల వల్లేగా సరికొత్తగ కనిపిస్తున్నాగా తొలిసారి పెదవి గమ్మంలో చిరునవ్వే అడుగుపెట్టింది కడదాకా ఉండిపోతే బాగుండనిపిస్తోంది తొలిసారి గుండెసడి లోకి అలలాంటి అల్లరొచ్చింది ప్రతిసారి కావాలంటూ అడగాలనిపిస్తుంది ప్రేమంటే ఇంతే ప్రేమంటే ఇంతే ప్రేమించే మనసుంటే ఏ మనసూ చూస్తూ ఆగదే ప్రేమంటే ఇంతే ప్రేమంటే ఇంతే ప్రాణాలే ఇచ్చేద్దాం అనిపిస్తూ ఉంటుందే చల్లగా చిరుగాలై చుట్టేశావుగా హో.. మెల మెల్లగా సెగలోకీ నెట్టేశావుగా హో.. నాలో నే నవ్వేస్తున్నా నాకై నే వెతికేస్తున్నా నీలాగే కనిపిస్తున్నా హయ్యాయ్యో నీవల్లే నా మనసే నన్నేనాడూ ఏదీ అడిగిందే లేదు తొలిసారి కావాలందీ నిన్నేలే ప్రేమంటే ఇంతే ప్రేమంటే ఇంతే ప్రేమించే మనసుంటే ఏ మనసూ చూస్తూ ఆగదే ప్రేమంటే ఇంతే ప్రేమంటే ఇంతే ప్రాణాలే ఇచ్చేద్దాం అనిపిస్తూ ఉంటుందే
Lyrics sourced from public databases. May contain errors.