Song Details
Lyrics
చినికి చినికి చిలిపి గాలి తడి తగిలి తగిలి వలపు వానజడి కురిసి కురిసి వయసు వాగువడి పెరిగి పెరిగి మనసు గండిపడి వరదై వరదై ఉరుకు ప్రేమనది ఒడులై సుడులై కడలై ఎగిసినదే ఏమైందో ఏమైందో ఇపుడసలేమేమి ఔతుందో సమయం ఎం చేయ్యమంటుందో తెలియదే తెలియదే తెలియదే తెలియదే ఈడు బరిలో అధరాలు నిలబడి సైనికులుగా సమరాన కలబడి ఏది గెలుపో మరిచేంత ఎగబడి ఆత్రపడుతూ మరికొంత మెలిపడి ఏకం అవుతూ తికమక ఎదో చేస్తూ సుఖముల రాజ్యాలేలే పదవిని పొందాయేమో పెదవులిలా మాయ మరుపే ముసిరింది మనలను హాయి మెరుపే తెరిచింది కనులను తీపి తలపే కలిపింది ఎదలను చేరువయితే అరచెయ్యి వదలను నేనే నీవై ఇప్పుడిక నాలో నేనే మిగలను నీలో శ్వాసై కదులుతూ లోలో ఆశై కరిగెదనే చినికి చినికి చిలిపి గాలి తడి తగిలి తగిలి వలపు వానజడి కురిసి కురిసి వయసు వాగువాడి పెరిగి పెరిగి మనసు గండిపడి వరదై వరదై ఉరుకు ప్రేమనది ఒడులై సుడులై కడలై ఎగిసినదే ఏమైందో ఏమైందో ఇపుడసలేమేమి ఔతుందో సమయము ఎం చేయమంటుందో తెలియదే తెలియదే తెలియదే తెలియదే తెలియదే తెలియదే
Lyrics sourced from public databases. May contain errors.