Song Details
Lyrics
హే కందిచేను కాడ హే కందిచేను కాడ కన్ను వేసినానే వంగచేను కాడ ఒళ్ళు మరచినానే జొన్న చేను కాడ మాటు వేసినానే సుందరాంగి హే మల్లి తోట కాడ మనసు కలుపుతాలే ఉల్లి తోట కాడ ఊసులాడుతాలే జామ తోట కాడ జాము గడుపుతాలే తొందరేమి హే పరువాల పాలపిట్టవే నా తస్సదియ్య మస్సాల కోడిపెట్టవే హే నందమూరి అందగాడివే నా సామి రంగ సరసాల చందురూడివే చుక్కాని చుక్కవే మందార మొగ్గవే అందాలు దక్కనీవే సందెకాడ వస్తనంది మర్చిపోకు వచ్చి ఇస్తనన్న ముద్దులియక వెళ్లిపోకు హోయ్ మల్లి పూల మత్తుజల్లి అల్లుకోకు నన్ను మళ్ళి మళ్ళి ముగ్గులోకి దించమాకు హే కందిచేను కాడ హే కందిచేను కాడ కన్ను వేసినానే వంగచేను కాడ ఒళ్ళు మరచినానే జొన్న చేను కాడ మాటు వేసినానే సుందరాంగి హేయ్ పళ్ళ బుట్టలా అరె తేనె బుట్టలా హొయ్ పూల తట్టలా ఉంది పిల్ల చూడరా హే చేప తొట్టెలా అరె వేపగుట్టలా హేయ్ టేకు చెక్కలా ఏంటి పిల్లగాడురా హే రావే నీ దిమ్మ దియ్య రేయే తెల్లరదియ్య దుమ్మె దుమ్మెత్తి పోయే వంత పాటలా రారో నా తోందరయ్య నీతోని చిందులెయ్య నువ్వే నా కొంగు పట్టి బంతులాడరో అత్తమ్మ కూతురా రత్తమ్మ జాతరో సొత్తంత బండికెత్తరో ఆరబెట్టి ఉరబెట్టి ఉంచినాన్లే నీకు ఇష్టమైతే పీత పులుసు పంచుతాలే హే కోక గుట్టు కొమ్మ చాటు దించుతాలే నీకు ఆకలైతే తేనె బొట్టు వంచుతాలే మల్లి తోట కాడ మనసు కలుపుతాలే ఉల్లి తోట కాడ ఊసులాడుతాలే జామ తోట కాడ జాము గడుపుతాలే తొందరేమి కందిచేను కాడ కన్ను వేసినానే వంగచేను కాడ ఒళ్ళు మరచినానే జొన్న చేను కాడ మాటు వేసినానే సుందరాంగి లేత పైటరో అరె లేవగొట్టరో హో బుగ్గ పండురో పంటి గాటు పెట్టరో హో లేడి రొట్టెరో పైన వెన్న బెట్టరో హొయ్ చెయ్య పట్టరో నెయ్యి కరగ బెట్టరో ఇస్ ఆ పెట్టె కాలేటివేళ ఇట్టా నా కాలిలోన ముల్లెదో గుచ్చుకుంది తీసి పెట్టవో ఇల్లా నా సూది గుచ్చి అల్లా నే ముళ్ళు తీస్తా పిల్లా నీ కాలు కాస్త కదల బెట్టవో అబ్బబ్బ నొప్పిరో అమ్మమ్మ నొప్పిరో ముద్దిస్తే నొప్పి తగ్గురో మొత్తుకుంటు లొల్లి లొల్లి పెట్టమాకు నిన్ను ఎత్తుకుంట ఇంటికెళ్లి చెప్పమాకు హే ఇంక నాకు వేసుకోర మందు మాకు చీర అంచు దాటి ఎక్కుతోంది మంట నాకు హే కందిచేను కాడ హే కందిచేను కాడ కన్ను వేసినానే వంగచేను కాడ ఒళ్ళు మరచినానే జొన్న చేను కాడ మాటు వేసినానే సుందరాంగి మల్లి తోట కాడ మనసు కలుపుతాలే ఉల్లి తోట కాడ ఊసులాడుతాలే జామ తోట కాడ జాము గడుపుతాలే తొందరేమి
Lyrics sourced from public databases. May contain errors.