Song Details
Lyrics
పల్లవి: అంతా ప్రేమమయం జగమంతా ప్రేమమయం ఈ క్షణం వలపు వీక్షణం పరమతీక్షణం మరల రానే రాదీసమయం అంతా ప్రేమమయం జగమంతా ప్రేమమయం ఈ క్షణం వలపు వీక్షణం పరమతీక్షణం మరల రానే రాదీసమయం చరణం: 1 ఈడు అన్నది పుట్టకపోతే తోడు అన్నది ఎందుకురా మోడువారే ఈడుకు తోడు ఉందిలే నీ లాభమురా కామమన్నది పురుషార్థం మోక్షమన్నది పరమార్ధం రక్తిలేక ముక్తి లేదు శక్తి లేక సృష్ఠిలేదు కామిగాక మోక్షగామి ఏనాడు కాలేవురా చరణం: 2 ఆడదన్నది పుట్టకపోతే అందమన్నది ఎక్కడరా ఆత్మలోపాల అందం ఉంటే ఆడదన్నది ఎందుకురా చీకటిల్లుర జీవితము జ్ఞానమొకటే నీ దీపం ఆశఉంటే అనుచుకోకు ఆయువుండి చచ్చిపోకు తప్పునైన ఒప్పునైన ఆపబోతే అంతేనురా అంతా ప్రేమమయం జగమంతా ప్రేమమయం ఈ క్షణం వలపు వీక్షణం పరమతీక్షణం మరల రానే రాదీసమయం
Lyrics sourced from public databases. May contain errors.