Song Details
Lyrics
పల్లవి: ఏ జన్మ బంధమో ఈ స్నేహం ఏ దివ్య రూపమో నేస్తం ఎన్నాళ్ళ మౌనమో ఈ రాగం ఇన్నాళ్ల కొచ్చెనా సాయం నేనున్నా అంది నీచూపే నేనున్న ధ్యాస నీవైపే ఔనన్నా ఎవరు కాదన్నా నువ్వేనా ప్రాణం ప్రాణం ఏ జన్మ బంధమో ఈ స్నేహం ఏ దివ్య రూపమో నేస్తం ఎన్నాళ్ళ మౌనమో ఈ రాగం ఇన్నాళ్ల కొచ్చెనా సాయం చరణం: 1 ఎంతెంత దూరం ఆనంద తీరం అనుకుంటూ తిరిగా ఇన్నాళ్ళు గోరంత స్నేహం కొండంత తోడై కనిపించగానే కన్నీళ్లు గుండెల్లో భారాలు మాయమై నీరెండల్లో సెలయేటి స్నానమై నిను కోరితే నీ ఒడి చేరితే మనసెగిరింది మేఘాల దారుల్లో చరణం: 2 అపురూపమైన బంగారు నువ్వు అనుకోని కలవై కలిశావు క్షణ కాలమైన విడలేను నిన్ను కను రెప్ప లోనే ఉంటావు స్నేహాన్ని దాటాను ప్రేమతో ఈ దేహాన్ని వదలాలి ప్రేమలో నీ నీడగా నీ చెలికాడుగా ప్రేమిస్తాను నీకన్న నిన్నెంతో నేనున్నా అంది నీచూపే నేనున్న ధ్యాస నీవైపే ఔనన్నా ఎవరు కాదన్నా నువ్వేనా ప్రాణం ప్రాణం ఏ జన్మ బంధమో ఈ స్నేహం ఏ దివ్య రూపమో నేస్తం ఎన్నాళ్ళ మౌనమో ఈ రాగం ఇన్నాళ్ళకొచ్చెనా సాయం
Lyrics sourced from public databases. May contain errors.