Song Details
Lyrics
కీలుగుఱ్ఱమెక్కాడే, కిందామీదా పడ్డాడే, రాకుమారి కావాలన్నాడే... ఊబిలోకి దూకాడే, ఊతా గట్రా లేనోడే, ఊరినల్ల ఏలాలన్నాడే... గాలిగాడు తీరేమారీ దారిలోకి వచ్చాడే, యావ మీద యాపారాన్నే పెట్టాడే... ఆరునూరు అయ్యేదాకా ఆవలించనన్నాడే, ఆగలేక సాగే లాగే ఉన్నాడే... హే, స్వారీ చెయ్ రా కాలం మీద... సీకుసింతలున్నోడే, సున్నా కన్నా సిన్నోడే, సిన్న సూపు సూడొద్దన్నాడే... జీవితాన్ని పిల్లోడే, పట్టాలెక్కించేసాడే, మైలు రాయి దాటించేసాడే... నోటి నీరు ఊరే ఊరే వంట ఈడు సేత్తాడే, తిన్నవాడు ఆహాలోకం సూత్తాడే... నోటు మీద గాంధీతాతే నవ్వుకుంటు వచ్చాడే, నవ్వుకుంట గల్లా పెట్టీ సేరాడే... హే అడ్డే నీకు లేదియ్యాల. నీకై వీచే పిల్లగాలి ఈవేళ శ్వాసల్లే చేరిందా ఎదలో!! నిన్నా మొన్నా ఉన్న బాధ ఈవేళ హాయల్లే మారిందా మదిలో!! సడి లేని జడివాన సరదాగా కురిసిందా!! మనసారా తడి లోన పొడి ప్రాణం తడిసిందా!! గుండెల్లో ఉండే ప్రేమ, కళ్ళల్లో చేరిందమ్మా... చూపుల్లో ఉండే ప్రేమ, దాగేనా!! దాచాలన్న కుదరదు సుమా అసలొకమాటైనా ఎవరితో అనకుండా అలిగెలిపోయింది దూరమెందుకో! అంతు లేని సంతోషం గంతులేసే ఈ నిమిషం ఇద్దరొక్కటయ్యారోయ్ ఇపుడే ఇపుడే... ఏ బాధాబందీ లేదియ్యాల ఉంది నేడు బాగానే నిన్నా మొన్నా లాగానే రేపు కూడ ఉంటాదంటావా!! గడ్డురోజులొస్తేనే కష్టం సుట్టం ఐతేనే మార్పు నీలో వస్తాదంటావా! ఈతిబాధలొచ్చాయంటూ బోరుబోరుమంటావా!! వద్దు వద్దు అంటే నువ్వే ఇంటావా!! ఓడ లేని రేవే నీవై బోసిపోయి ఉంటావా!! ఓడిపోని వారే లేరోయ్ సూత్తావా!!! హే ..సాయం జేసే కాలం రాదా!
Lyrics sourced from public databases. May contain errors.