Song Details
Lyrics
గుండె గోదారిలా .. చిందులేస్తోందిలా నీలిమేఘాలుగా .. తేలిపోతోందలా నేను నే కానుగా .. ఇంకోలా మారిలా .. నిజమా ! I am in love .. I am in love .. I am in love .. I am in love ! గుండె గోదారిలా .. చిందులేస్తోందిలా నాలో చూసాను ఏ నాడో ఓ వింతా ఎవరో ఆక్రమించారు మనసంతా ఊహల్లో నువ్వై చెలీ నా ఎదురుగ నిలిచావే అందంగా వలపువై నీ తలపులో ముంచావే నేను శూన్యం లా అయ్యానికా .. I am in love .. I am in love .. I am in love .. I am in love ! ప్రవహించింది నీ నుంచి ఓ ప్రేమా అది నను చేరి లయ పెంచే మదిలోనా మౌనంగా మనసుతో యే మంతనం జరిపావే చిత్రంగా అడుగునై నీ అడుగుతో కదిలానే నీకే అయినానే ప్రియబానిసా ! I am in love .. I am in love .. I am in love .. I am in love ! గుండె గోదారిలా .. చిందులేస్తోందిలా నీలిమేఘాలుగా .. తేలిపోతోందలా
Lyrics sourced from public databases. May contain errors.