MovieGQ

Karigi Poyanu

Marana Mrudhangam (1988) · Track 3 of 5

Lyrics

పల్లవి: కరిగిపోయాను కర్పూర వీణలా కలిసిపోయాను నీ వంశధారలా నా గుట్టు జారిపోతున్నా నీ పట్టు చిక్కిపోతున్నా నీ తీగ వణికిపోతున్నా రాగాలు దోచుకుంటున్నా కురిసిపోయింది ఓ సందె వెన్నెలా.. కలిసిపోయాక ఈ రెండు కన్నులా... చరణం: 1 మనసుపడిన కథ తెలుసుగా ప్రేమిస్తున్నా తొలిగా పడుచు తపనలివి తెలుసుగా మన్నిస్తున్నా చెలిగా ఏ ఆశలో... ఒకే ధ్యాసగా ఏ ఊసులో ... ఇలా బాసగా అనురాగాలనే బంధాలనే పండించుకోమని తపించగా కరిగిపోయాను కర్పూర వీణలా కురిసిపోయింది ఓ సందె వెన్నెలా నా గుట్టు జారిపోతున్నా నీ పట్టు చిక్కిపోతున్నా నీ తీగ వణికిపోతున్నా రాగాలు దోచుకుంటున్నా కరిగిపోయాను కర్పూర వీణలా కురిసిపోయింది ఓ సందె వెన్నెలా చరణం: 2 అసలు మతులు చెడి జంటగా ఏమవుతామో తెలుసా జతలుకలిసి మనమొంటిగా ఏమైనా సరిగరిసా ఏ కోరికో శృతే మించగా ఈ ప్రేమలో ఇలా ఉంచగా అధరాలెందుకో అందాలలో నీ ప్రేమలేఖలే లిఖించగా కురిసిపోయింది ఓ సందె వెన్నెలా కలిసిపోయాను నీ వంశధారలా నీ తీగ వణికిపోతున్నా రాగాలు దోచుకుంటున్నా నా గుట్టు జారిపోతున్నా నీ పట్టు చిక్కిపోతున్నా కురిసిపోయింది ఓ సందె వెన్నెలా కలిసిపోయాను నీ వంశధారలా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Marana Mrudhangam

See All