Song Details
Lyrics
పల్లవి: ఎన్నాళ్ళో వేచిన ఉదయం... ఈనాడే ఎదురౌతుంటే ఇన్ని నాళ్ళు దాచిన హృదయం... ఎగసి ఎగసి పోతుంటే ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి చరణం: 1 మంచిని పెంచిన మనిషిని... ఏ వంచన ఏమీ చేయదని నీతికి నిలబడు వానికి... ఏ నాటికి ఓటమి లేదని నీతికి నిలబడు వానికి... ఏ నాటికి ఓటమి లేదని నే చదివిన జీవిత పాఠం నీకే నేర్పాలనివస్తే ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి చరణం: 2 నాగులు తిరిగే కోనలో ఏ న్యాయం పనికిరాదని కత్తులు విసిరేవానిని... ఆ కత్తితోనె గెలవాలని కత్తులు విసిరేవానిని... ఆ కత్తితోనె గెలవాలని నేనెరిగిన చేదు నిజం నీతో చెప్పాలని వస్తే ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురౌతుంటే ఇన్ని నాళ్ళు దాచిన హృదయం ఎగసి ఎగసి పోతుంటే ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి
Lyrics sourced from public databases. May contain errors.