Nenu Gaali Gopuram
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singers
- Udit Narayan
Lyrics
- నేను గాలి గోపురం నీవు ప్రేమ పావురం
వచ్చి వాలే ఈ క్షణం
నేను తెల్లకాగితం నీవు తేనె సంతకం
కోరుకున్నా ఈ దినం
ప్రేమకు దేవత నీవని తెలిసి
నామది నీకొక కోవెల చేశా
ఓ ప్రియా... ఓ ప్రియా... ఓ ప్రియా...
నేను గాలి గోపురం నీవు ప్రేమ పావురం
వచ్చి వాలే ఈ క్షణం
మాఘమాస వేళ ఈ మంచు తెరలలోన
యవ్వనాల బాలా నీ పెదవులందుకోన
పులకరింత పూజ ఈ పూట చేసుకోరా
కలవరింతలన్ని నే కౌగిలించు కోనా
మాయో ఏమి మాయో ఎంతో హాయో ఈ బంధం
నీడో తోడు నీడో నాకు నీవే జన్మాంతం
ఓ ప్రియా... నా ప్రియా...
యా యా నీ దాన్నైపోయా
నేను గాలి గోపురం నీవు ప్రేమ పావురం
వచ్చి వాలే ఈ క్షణం
నేను తెల్లకాగితం నీవు తేనె సంతకం
కోరుకున్నా ఈ దినం
ఈ వసంత వేళ నీ వయసు పూలు పూసే
పూలగాలినీవో నా వలపు వీణ ఊదె
ప్రేమమందిరాన కుడికన్ను అదిరెనేల
పెళ్లిమండపాన కుడికాలు పెట్టిరావ
నీవే నాకు నీవే సాగిరావే నాకోసం
దేవా ప్రేమ దేవా నీకు సేవే నా ప్రాణం
ఓ ప్రియా... నా ప్రియా...
యా యా నీ వాడ్నైపోయా
నేను గాలి గోపురం నీవు ప్రేమ పావురం
వచ్చి వాలే ఈ క్షణం
నేను తెల్లకాగితం నీవు తేనె సంతకం
కోరుకున్నా ఈ దినం
ప్రేమకు దేవత నీవని తెలిసి
నామది నీకొక కోవెల చేశా
ఓ ప్రియా... ఓ ప్రియా... ఓ ప్రియా...
నేను గాలి గోపురం నీవు ప్రేమ పావురం
వచ్చి వాలే ఈ క్షణం
Manasunna Maaraju
Movie More SongsNenu Gaali Gopuram Keyword Tags
-
-