Nuvu Marosari Anu
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singers
- Kalyani Malik
Lyrics
- నువ్వు మరోసారి అను మరోసారి అను చిలకా
మది వినేలాగా అను
నువ్వు మరోసారి విను మరోసారి విను సరిగా
ఇది వెయ్యోసారి విను
మనసు తపన అదే.. తలపు అదే
తెరవిడి రాదేం త్వరగా
కలలుగనే కలను కనే కల అనుకుంటే కుదరదుగా
నేనెలా చెప్పనిక ముద్దిస్తావు అని
ఉరిమిన మేఘం తొలకరి శృతిలో పలికిందా
ముదిరిన దాహం మధువుల నదిలో మునిగిందా
నిన్ను తలపై నిలిపే చొరవిస్తే శివుడైపోనా దివి చినుకా
దిగివస్తాలే సొగసిస్తాలే
నీ పెదవేలే పదవే చాలే
నీకదే మోక్షమను సరే కాదనను
చిలిపి దుమారం చెలిమికి ద్వారం తెరిచిందా
వయసు విహారం వెతికిన తీరం దొరికిందా
నా గెలుపే తెలిపే చిరునవ్వై మహ మెరిశావే మణితునక
సఖి సావాసం..ఇక నీ కోసం
ప్రతి ఏకాంతం నాకే సొంతం
ఈ అల్లరే ఇష్టపడి వరించాను నిన్ను
Manasu Maata Vinadhu
Movie More SongsNuvu Marosari Anu Keyword Tags
-
-