MovieGQ

Inthe Ee Prema Varasa

Manasichi Chudu (1998) · Track 1 of 6

Lyrics

నాలో ఏదేదో ఆయిపోతున్నదే అంతే ఈ ప్రేమ వరస దాని అంతే చూడాలి వయసా నీ తోడు కోరింది నా ఊపిరి అంతే ఈ ప్రేమ వరస దాని అంతే చూడాలి వయసా ఈ వేళ ఈ సూర్యోదయం ఇన్నాళ్ళులాగలేదు కాదా నీ లోన ఈ ప్రేమోత్సవం ఈ రోజే పుట్టినట్టు ఉందాలేదా నాలో ఏదేదో ఆయిపోతున్నదే అంతే ఈ ప్రేమ వరస దాని అంతే చూడాలి వయసా బాష మొత్తము మాయమైనదా గుండె మాట గొంతుదాటి రాదే అంతే ఈ ప్రేమ వరస దాని అంతే చూడాలి వయసా శ్వాసమాత్రము గేయమైనదా హాయి పాట నన్ను మీటుతోంది అంతే ఈ ప్రేమ వరస దాని అంతే చూడాలి వయసా నీలో ఏదో కొత్తకోణం చూశా నువ్వు నువ్వేన కాళిదాసా నువ్వే కదా నిండు ప్రాణంపోసి వీడ్ని పెంచావు కన్నె హంస ఒక్క మాటే అని కోటి భావాలని అందజేయాలని కొత్త పాఠం నీదే తెలుసా నాలో ఏదేదో ఆయిపోతున్నదే అంతే ఈ ప్రేమ వరస దాని అంతే చూడాలి వయసా కన్ను బొత్తిగా చిన్నదైనదా నిన్ను తప్ప ఏమిచూడలేదే అంతే ఈ ప్రేమ వరస దాని అంతే చూడాలి వయసా కొన్ని ఏళ్లుగా ముందుకెళ్లక కాలమంత ఆగిపోయి ఉంది అంతే ఈ ప్రేమ వరస దాని అంతే చూడాలి వయసా ఏతా వాత దీని వాటం చూస్తే తియ్యగావున్న కత్తికోత ఇంటా బయటా మొగమాటం పెట్టె తప్పుకోలేని వింత వేట మంచు మంటై ఇలా అంటుకుంటే ఎలా పంచుకుంటే తనే తగ్గుతుందో ఏమో బహుశా నాలో ఏదేదో ఆయిపోతున్నదే అంతే ఈ ప్రేమ వరస దాని అంతే చూడాలి వయసా నీ తోడు కోరింది నా ఊపిరి అంతే ఈ ప్రేమ వరస దాని అంతే చూడాలి వయసా ఈ వేళ ఈ సూర్యోదయం ఇన్నాళ్ళులాగలేదు కాదా నీ లోన ఈ ప్రేమోత్సవం ఈ రోజే పుట్టినట్టు ఉందాలేదా నాలో ఏదేదో ఆయిపోతున్నదే అంతే ఈ ప్రేమ వరస దాని అంతే చూడాలి వయసా అంతే ఈ ప్రేమ వరస దాని అంతే చూడాలి వయసా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Manasichi Chudu

See All