Idi Tholirathri
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singer
-
Lyrics
- పల్లవి:
ఇది తొలిరాత్రి... కదలని రాత్రి...
ఇది తొలిరాత్రి కదలని రాత్రి
నీవు నాకు నేను నీకు చెప్పుకున్న కథల రాత్రీ...
ప్రేయసి రావే... ఊర్వశి రావే
ప్రేయసి రావే... ఊర్వశి రావే
ఇది తొలిరాత్రి కదలని రాత్రి
నీవు నాకు నేను నీకు చెప్పుకున్న కథల రాత్రీ...
ప్రేయసి రావే... ఊర్వశి రావే
ప్రేయసి రావే... ఊర్వశి రావే
చరణం: 1
వెన్నెలమ్మ దీపాన్నీ ఆర్పమన్నదీ
మల్లెలమ్మ పరదాలు మూయమన్నదీ
వెన్నెలమ్మ దీపాన్నీ ఆర్పమన్నదీ
మల్లెలమ్మ పరదాలు మూయమన్నదీ
ధూపమేమో మత్తుగా తిరుగుతున్నదీ
దీపమేమో విరగబడి నవ్వుతున్నదీ
నీ రాక కొరకు తలుపు
నీ పిలుపు కొరకు పానుపు
పిలిచి పిలిచి వేచి వేచి
ఎదురు చూస్తున్నవీ ఈఈఈ
ప్రేయసి రావే... ఊర్వశి రావే
ప్రేయసి రావే... ఊర్వశి రావే
చరణం: 2
వెన్నలంతా అడవిపాలు కానున్నదీ
మల్లెమనసు నీరుకారి వాడుతున్నదీ
ఆ...ఆ వెన్నలంతా అడవిపాలు కానున్నదీ
మల్లెమనసు నీరుకారి వాడుతున్నది
అనురాగం గాలీలో దీపమైనదీ
మమకారం మనసునే కాల్చుతున్నదీ
నీ చివరిపిలుపు కొరకూ
ఈ చావురాని బ్రతుకూ
చూసి చూసి వేచి వేచి
వేగిపోతున్నదీ... ఆ ఆ ఆ
ప్రేయసి రావే... ఊర్వశి రావే
ప్రేయసి రావే... ఊర్వశి రావే
ఇది తొలిరాత్రి కదలని రాత్రి
నీవు నాకు నేను నీకు చెప్పుకున్న కథల రాత్రీ...
ప్రేయసి రావే... ఊర్వశి రావే
ప్రేయసి రావే... ఊర్వశి రావే
ప్రేయసి రావే... ఊర్వశి రావే
- పల్లవి:
Majnu
Movie More SongsIdi Tholirathri Keyword Tags
-
-
-


