MovieGQ

Priyathama Priyathama

Majili (2019) · Track 2 of 6

Song Details

Music Director
Lyricist

Lyrics

పల్లవి: ప్రియతమా ప్రియతమా పలికినది హృదయమే సరిగమ చిలిపిని తలపులో తెలిసినది వలపులో మధురిమా చెలి చూపు తాకినా ఉలకవా పలకవా వలవేసి వేచి చూస్తున్నా దొరకనే దొరకవా ఇష్టమైన సఖుడా ఇష్టమైన సఖుడా ఒక్కసారి చూడరా పిల్లడా చక్కనైన చుక్కరా చక్కనైన చుక్కరా నిన్నుకోరుకుందిరా సుందరా ప్రియతమా ప్రియతమా పలికినది హృదయమే సరిగమ చిలిపిని తలపులో తెలిసినది వలపులో మధురిమా చరణం: 1 నీ ప్రేమలో ఆ రాధనై నే నిండుగా మునిగాక నీకోసమే రాశానుగా నా కళ్లతో ప్రియలేఖ చేరునో చేరదో తెలియదు ఆ కానుక ఆశనే వీడక వెనక పడెను మనసు పడిన మనసే ఇష్టమైన సఖుడా ఇష్టమైన సఖుడా ఒక్కసారి చూడరా పిల్లడా చరణం: 2 ఉన్నదిరా ఉంటానురా నీ నీడలో కడదాకా కన్నీటితో కార్తీక పూ దీపాన్నిరా నువులేక దూరమే భారమై కదలదు నా జీవితం నీవు నా చేరువై నిలిచెనసలు మధుర క్షణములెపుడో ప్రియతమా ప్రియతమా పలికినది హృదయమే సరిగమ చిలిపిని తలపులో తెలిసినది వలపులో మధురిమా చెలి చూపు తాకినా ఉలకవా పలకవా వలవేసి వేచి చూస్తున్నా దొరకనే దొరకవా ఇష్టమైన సఖుడా ఇష్టమైన సఖుడా ఒక్కసారి చూడరా పిల్లడా చక్కనైన చుక్కరా చక్కనైన చుక్కరా నిన్నుకోరుకుందిరా సుందరా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Majili

See All