Song Details
Lyrics
సీతే రాముడి కట్నం సీతే రాముడి కట్నం ఆ సీతకు రాముడు దైవం అడవులనైనా అయోధ్యనైనా రామయ్యే సీతమ్మకు పేరంటం రామయ్యే సీతమ్మకు పేరంటం సీతే రాముడి కట్నం ఆ సీతకు రాముడు దైవం సీత అడిగిన వరమొకటే చిటెకెడు పసుపు కుంకుమలే రాముడు అడిగిన నిధి ఒకటే అది సీతమ్మ సన్నిధే సీత అడిగిన వరమొకటే చిటెకెడు పసుపు కుంకుమలే రాముడు అడిగిన నిధి ఒకటే అది సీతమ్మ సన్నిధే ఏడు అడుగులు నడిచేది ఏడు జన్మల కలయికకే పడతులకైనా పురుషులకైనా ఆ బంధం నూరేళ్ళ సౌభాగ్యం ఆ బంధం నూరేళ్ళ సౌభాగ్యం సీతే రాముడి కట్నం ఆ సీతకు రాముడు దైవం ఆడజన్మకు వరమొకటే మనిషికి తల్లిగ జన్మనివ్వటం పురుష జన్మకు విలువొకటే కాసుకు అమ్ముడు పోకపోవడం ఆడజన్మకు వరమొకటే మనిషికి తల్లిగ జన్మనివ్వటం పురుష జన్మకు విలువొకటే కాసుకు అమ్ముడు పోకపోవడం రామకథలుగా వెలసేది స్త్రీల ఋజువుగా నిలిచేది ఆనాడైనా ఏనాడీనా సీతమ్మ రామయ్యల కళ్యాణం సీతమ్మ రామయ్యల కళ్యాణం సీతే రాముడి కట్నం ఆ సీతకు రాముడు దైవం అడవులనైనా అయోధ్యనైనా రామయ్యే సీతమ్మకు పేరంటం ఆ ఆ ఆ ఆ ఉం ఉం ఉం ఉం
Lyrics sourced from public databases. May contain errors.