MovieGQ

Vasantham

Madhumasam (2007) · Track 6 of 6

Song Details

Lyrics

పల్లవి: వసంతం వాయిదా పడైనా రాదుగా కనీసం కమ్మగా కలైనా కావుగా ఈ కాంత కోకిలా వలచినా పిలిచినా ప్రియతమా వసంతం వాయిదా పడైనా రాదుగా చరణం: 1 విరజాజి పూలే విరహాన రాలే మలిసందే వేళే తెలవారి పోయే పొడి ఇసుక దారులలో మన అడుగు జాడలలో గతము తలచి కలిసి నడిచి వలపు కలయిక కలా నిదుట నిలచి ఎదను తెరచి క్షణము దొరకవు కదా వసంతం వాయిదా పడైనా రాదుగా కనీసం కమ్మగా కలైనా కావుగా చరణం: 2 బస్తీల నిండా బృందావనాలే ముస్తాబు మీద హస్తాక్షరాలే ఎదురసలు చూడనిది మనము అనుకోనిదిది మనసు అలుపు మమత అలుకు జతను కలిపెను కదా ఎవరికెవరు ఒకరికొకరు ఇపుడె తెలిసెను కదా వసంతం వాయిదా పడైనా రాదుగా కనీసం కమ్మగా కలైనా కావుగా ఈ కాంత కోకిలా వలచినా పిలిచినా ప్రియతమా వసంతం వాయిదా పడైనా రాదుగా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Madhumasam

See All