Song Details
Lyrics
వచ్చే వచ్చే వైశాఖంలో పల్లకి ఈ పిల్లకి తెచ్చే తెచ్చే వైభోగాలే ప్రేమకి మా పెళ్లికి చిగురుటాకు రాశి చూసి చిలక జ్యోస్యమేదో అడిగి పులకరింత పందిరేసి పూలసంత పానుపేసి మల్లెలే మాయగా మత్తుజల్లగా ఓ వచ్చే వచ్చే వైశాఖంలో పల్లకి ఈ పిల్లకి హత్తుకున్న నీ ఒళ్ళు మత్తు మల్లె పూజల్లు పెళ్లి ఆడు కున్నాయి కౌగిలింతలు ఏకమైన ఎంగిల్లు వెన్నెలమ్మ పొంగల్లు పిలుపందుకున్నాయి బుజ్జగింతలు దీపాలెట్టే చోటులో జడ తాళాలేసే జతసిరి మాటలో ఎద కలిసే వేళ వయసే హేళ వలచే వేళ పండిన కలలా వచ్చే వచ్చే వైశాఖంలో పల్లకి ఈ పిల్లకి రామచిలక రాగాలు రామపండు పాదాలు కోరుకున్న భోగాలు గోరువంకవే కోకచాటు పాదాలు కొంగుచాటు యోగాలు సోకులమ్మ శ్లోకాలు నాకు చిలకవే చిగురాకుల్లోన స్వాతిలా పొగరెక్కి పాడే గడసరి కోకిల బిగిసింది ప్రాణం మధనుడి బాణం పలికిందేదో పరువపు ప్రాణం వచ్చే వచ్చే వైశాఖంలో పల్లకి ఈ పిల్లకి తెచ్చే తెచ్చే వైభోగాలే ప్రేమకి మా పెళ్లికి చిగురుటాకు రాశి చూసి చిలక జ్యోస్యమేదో అడిగి పులకరింత పందిరేసి పూలసంత పానుపేసి మల్లెలే మాయగా మత్తుజల్లగా వచ్చే వచ్చే వైశాఖంలో పల్లకి ఈ పిల్లకి
Lyrics sourced from public databases. May contain errors.