MovieGQ

Mata Ivvamma Chelli

Maavichiguru (1996) · Track 3 of 7

Lyrics

మాట ఇవ్వమ్మా చెల్లీ మరచి పోకె నా తల్లి నా ఇంటిలో నువ్వు మళ్ళీ దీపాన్ని పెట్టమ్మ వెళ్ళి మట్టి పాలవుతున్న నా ఆశలన్ని నీలో మళ్ళీ చిగురించాలి అప్పగిస్తున్నాను నిన్నే నమ్మి నిత్యం కొలిచే నా రాముణ్ణి బంగారు సీతమ్మవై పూజించుకుంటానని కలకాలము పచ్చగా కనిపెట్టి ఉంటానని మాట ఇవ్వమ్మా చెల్లీ మరచి పోకె నా తల్లి నా ఇంటిలో నువ్వు మళ్ళీ దీపాన్ని పెట్టమ్మ వెళ్ళి పాతికేళ్ళ పెనిమిటైనా పాపాయిలా చూసుకున్నా కాలుజారుతుందో ఏమో అని కళ్ళల్లోనే దాచుకున్నా కన్న బిడ్డకన్న మొగుడు మీదనే నా బెంగ ఎల్లప్పుడూ పిచ్చి తల్లినో గడుసు పిల్లనో చెప్పలేనె ఇప్పుడూ ఏనాడైనా ఒక్కమాటైనా అనలేదమ్మా వెర్రి నాయనా అటువంటి మారాజుకీ తగు జంట అవుతాననీ త్వరలోనె నా ఊసునీ మరపింప చేస్తాననీ మాట ఇవ్వమ్మా చెల్లీ మరచి పోకె నా తల్లి నా ఇంటిలో నువ్వు మళ్ళీ దీపాన్ని పెట్టమ్మ వెళ్ళి ముత్తైదుగా పైకి వెళ్ళే భాగ్యాన్ని పొందాను గనకా వస్తాను త్వరలోనె మళ్ళీ ఆ పుణ్యమే తోడురాగా ఏమి చేసినా కన్న తండ్రిలా కాపాడు శ్రీవారి ప్రేమా ఎంత పొందినా తనివి తీరదే కావాలి ఇంకొక్క జన్మా ఆ చేతుల్లో చిట్టి పాపనై ఉయ్యాలలూగే తృప్తి కోసమై వచ్చేది నేనేననీ గుర్తుంచుకుంటాననీ ఆ కొత్త జన్మానికీ నా పేరె పెడతాననీ మాట ఇవ్వమ్మా చెల్లీ మరచి పోకె నా తల్లి నా ఇంటిలో నువ్వు మళ్ళీ దీపాన్ని పెట్టమ్మ వెళ్ళి మట్టి పాలవుతున్న నా ఆశలన్ని నీలో మళ్ళీ చిగురించాలి అప్పగిస్తున్నాను నిన్నే నమ్మి నిత్యం కొలిచే నా రాముణ్ణి బంగారు సీతమ్మవై పూజించుకుంటానని కలకాలము పచ్చగా కనిపెట్టి ఉంటానని మాట ఇవ్వమ్మా చెల్లీ మరచి పోకె నా తల్లి నా ఇంటిలో నువ్వు మళ్ళీ దీపాన్ని పెట్టమ్మ వెళ్ళి

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Maavichiguru

See All