Song Details
Lyrics
పల్లవి: ఓ జాబిలమ్మ ఎందుకు ఎందుకు అందవమ్మా ఓ చందరయ్య ఎందుకు ఎందుకు తొందరయ్య పెందలాడె మీగడమ్మ పెట్టకుంటే ఆగడమ్మ గుమ్మపాల గుమ్మా కమ్మగా అబ్బబ్బబ్బబ్బా ఓ జాబిలమ్మ ఎందుకు ఎందుకు అందవమ్మా చరణం: 1 పంచదార ఇసకల్లోన - అబబ్బా అబబ్బా అబబ్బా పాయసాల తరకల్లోన - అబబ్బా అబబ్బా అబబ్బా కస్సుబుస్సు మన్న కొద్దీ కౌగిలింతలు యవ్వనలు దువ్వుతుంటే ఎన్నివింతలు ఏరన్నాక నీరొస్తాది ఎండన్నాక నీడొస్తాది నికేమొస్తది ఒళ్ళున్నాక ఈడొస్తాది ఈడొచ్చాక ఈలేస్తాది నన్నే తోస్తది ఓ జాబిలమ్మ ఎందుకు ఎందుకు అందవమ్మా చరణం: 2 కోకలమ్మ కులుకుల్లోన - అబబ్బా అబబ్బా అబబ్బా కొంగే జారి ముడుపుల్లోన - అబబ్బా అబబ్బా అబబ్బా ఒత్తిడెక్కువయ్యే కొద్దీ ఒంటి నలుగులు జాతరెక్కువైన కొద్దీ జంట వలపులు కన్నన్నాక చూపుంటాడి చూపన్నాక చురుకుంటాది నాకేముంటది హొయ్ చూపు చూపు చుట్టేశాక చాప దిండు చుట్టేశాక ఇంకేముంటది ఓ జాబిలమ్మ ఎందుకు ఎందుకు అందవమ్మా ఓ చందరయ్య ఎందుకు ఎందుకు తొందరయ్య పెందలాడె మీగడమ్మ పెట్టకుంటే ఆగడమ్మ గుమ్మపాల గుమ్మా కమ్మగా అబ్బబ్బబ్బబ్బా
Lyrics sourced from public databases. May contain errors.