Song Details
Lyrics
పల్లవి: కాలాత్మా సర్వభూతాత్మా! వేదాత్మా విశ్వతో ముఖ: !! దీనబంధూ దయాసింధో ! దివ్యాత్మా నమో నమ: !! ఒకే కులం ఒకే మతం అందరు ఒకటే.. అందరిని కాపాడే దేవుడొక్కడే అందులకే అతనికి తలవంచాలి.. అనుదినమూ ఆ దేవుని పూజించాలి ఒకే కులం ఒకే మతం అందరు ఒకటే.. అందరిని కాపాడే దేవుడొక్కడే అందులకే అతనికి తలవంచాలి.. అనుదినమూ ఆ దేవుని పూజించాలి ఒకే కులం ఒకే మతం అందరు ఒకటే.. అందరిని కాపాడే దేవుడొక్కడే చరణం: 1 భగవంతుని ప్రతిరూపం కరుణయందురు.. ఆ కరుణతో భగవంతుని చూడమందురు భగవంతుని ప్రతిరూపం కరుణయందురు.. ఆ కరుణతో భగవంతుని చూడమందురు కరుణయే మనిషికి దేవుని వరము.. అది పరులయెడల చూపినపుడే బ్రతుకు ధన్యము ఒకే కులం... ఒకే మతం.... అందరు ఒకటే చరణం: 2 పాపాలకు వేనవేలు దారులున్నవి.. ధర్మగోపురాని కొక్కటే ద్వారమున్నది పాపాలకు వేనవేలు దారులున్నవి.. ధర్మగోపురాని కొక్కటే ద్వారమున్నది నీతియే ఊపిరిగా నిలపాలి.. న్యాయమే బాటగా సాగాలి ఒకే కులం... ఒకే మతం... అందరు ఒకటే చరణం: 3 చెడుపనులు చేయకు.. చెడును చూడకు.. చెడుమాటలు.. నీ నోటను మాటలాడకు చెడుపనులు చేయకు.. చెడును చూడకు.. చెడుమాటలు.. నీ నోటను మాటలాడకు పగయే నీ శత్రువనే నిజము తెలుసుకో.. ప్రేమతో పగను గెలిచి బ్రతుకు దిద్దుకో... మన బాపూజీ మాట నిలుపుకో ఒకే కులం.. ఒకే మతం.. అందరు ఒకటే.. అందరిని కాపాడే దేవుడొక్కడే అందులకే అతనికి తలవంచాలి.. అనుదినమూ ఆ దేవుని పూజించాలి
Lyrics sourced from public databases. May contain errors.