Song Details
Lyrics
ముత్యాల పల్లకిలో నా కలల రాణి అదిగో ఆకాశ వీధులలో నా కనుల వెలుగు అదిగో పేరే స్వప్నబాల ఊరే మేఘమాల చేరువయ్యేన ఒకనాడు తలపులు చినుకులు కురిసిన తొలకరిలో ముత్యాల పల్లకిలో నా కలల రాణి అదిగో నేను చూసిన నయనాలు ఉషస్సులో కిరణాలు నవ్వు తరగని అధరాలు తేనె కొలనులు లేత చిగురుల చెక్కిళ్ళు ఉగాదిలో మావిళ్లు లేచి నడిచిన పాదాలు పూల మణుగులు మెరిసిన ముంగురులు మనసుకు లంగరులు సొగసుల భంగిమలు నా వయసుకు గింగిరులు నేనో బ్రహ్మచారి తానో రాకుమారి ఏకమయ్యేన ఒకనాడు మనసున కురిసిన మన్మధ నగరంలో ముత్యాల పల్లకిలో నా కలల రాణి అదిగో ఆకాశ వీధులలో నా కనుల వెలుగు అదిగో దోచుకున్నది దొరసాని సరాసరి హృదయాన్ని గుచ్చుతున్నది గురిచూసి మల్లె బాకుని కన్నెసొంపుల సంకెలతో ఎకాఎకి అల్లుకొని నన్ను చివరకి చేసింది జన్మ ఖైదుని నామది సీమలలో ప్రేమకు ఆమనివే నారీ లోకంలో చోర శిఖామణివే... నేనే నీకు బందీ నీతో రాసివుంది వేచి ఉంటాను వెయ్యేళ్ళు కమ్మని ఊహల కారాగారంలో
Lyrics sourced from public databases. May contain errors.