Song Details
Lyrics
అలిగావా చిట్టి చిలక దిగవా నేల వంకా అడుగేసా ఉండలేక చాల్లె బెట్టు చెయ్యకా అలిగావా చిట్టి చిలక దిగవా నేల వంకా అడుగేసా ఉండలేక చాల్లె బెట్టు చెయ్యకా అవుననుకో గోరువంకా అలుసిచ్చాను కనుక జరిగింది తెలుసుకోక నాపై నింద లేయక నీకేమీ ఊసుపోక నాదే నేరమనక నిజమంతే వాదించక.... అలిగావా చిట్టి చిలక దిగవా నేల వంకా అడుగేసా ఉండలేక చాల్లె బెట్టు చెయ్యకా ఓ కన్ను మూసి చూస్తున్నట్టు ఉంది నా ఒంటి నడక నాకే నచ్చకుంది నాతోనే నాకు గొడవయ్యినట్టు వుంది నా నుంచి నేనే వేరయ్యినట్టు వుంది ఊరుకోలేను చేరుకోలేను మనసిలా ఎందుకుంది మూగనేకాను మాటకాలేను ఎమిటవుతున్నది... అలిగావా చిట్టి చిలక దిగవా నేల వంకా అడుగేసా ఉండలేక చాల్లె బెట్టు చెయ్యకా నాతోట పువ్వే నాపై కోపమంటే ఈ ప్రాణమింకా వున్నా లేనిదంతే నాలోని సగమే నాకే దూరముంటే ఏ సందడైనా మనసే నవ్వదంతే చిలిపి జగడాన్ని పెంచుకున్నను నేస్తమా తప్పు నాదే చెలిమి విరహాన చేదు చూసాను పంతమా ఆగవే... అలిగావా చిట్టి చిలక దిగవా నేల వంకా అడుగేసా ఉండలేక చాల్లె బెట్టు చెయ్యకా నీకేమీ ఊసుపోక నాదే నేరమనక నిజమంతే వాదించక...
Lyrics sourced from public databases. May contain errors.