Melukoradha Krishna Melukoradha
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singers
- P. SusheelaS.P. Balasubrahmanyam
Lyrics
- పల్లవి :
మేలుకోరాదా... కృష్ణా... మేలుకోరాదా
మేలుకోరాదా... కృష్ణా... మేలుకోరాదా
నలుగురి మేలు కోరే వాడా... మమ్మేలుకోవేరా
మేలుకోరాదా... కృష్ణా... మేలుకోరాదా
నలుగురి మేలు కోరే వాడా... మమ్మేలుకోవేరా
మేలుకోరాదా...
చరణం: 1
ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ
జేబుదొంగలు లేచారు... దొరబాబు దొంగలు లేచారు
తడిగుడ్డలతో గొంతులు కోసే దగాకోరులు లేచారు
జేబుదొంగలు లేచారు... దొరబాబు దొంగలు లేచారు
తడిగుడ్డలతో గొంతులు కోసే దగాకోరులు లేచారు
బడా చోరులూ.. ఊ... ఊ... లేచారూ
ఎవడి దవడ నీ చేతి చలవతో ఎన్ని తునకలు కానుందో
ఏ జైలు నీ రాక కోసమై ఎంతగా ఎదురు చూస్తుందో
ఎవడి దవడ నీ చేతి చలవతో ఎన్ని తునకలు కానుందో
ఏ జైలు నీ రాక కోసమై ఎంతగా ఎదురు చూస్తుందో
ఎన్నికళ్ళతో..ఓ... ఓ... చూస్తుందో
మేలుకోరాదా... కృష్ణా... మేలుకోరాదా
నలుగురి మేలు కోరే వాడా... మమ్మేలుకోవేరా
మేలుకోరాదా...
చరణం: 2
మేలుకునే ఉన్నాం హమేషా మేలుకునే ఉంటాం
నలుగురి మేలు కోసం రేతిరి కూడా మేలుకునే ఉంటాం
ఖబడ్దార్...
మేలుకునే ఉన్నాం హమేషా మేలుకునే ఉంటాం
నలుగురి మేలు కోసం రేతిరి కూడా మేలుకునే ఉంటాం
మేలుకునే ఉన్నాం ...
ఉన్నోడికేమో తిన్నదరగదూ... లేనోడికా తిండే దొరకదు
ధర్మానికేమొ మొద్దు నిద్దరా... ఆ... దేవుడికా తీరికేదిరా
అందుకే మనం పుట్టాం... తొడ గొట్టాం
అందుకే మనం పుట్టాం... తొడ గొట్టాం
అన్యాయాన్ని చావబాదె డ్యూటీ చేపట్టాం
Krishnavatharam
Movie More SongsMelukoradha Krishna Melukoradha Keyword Tags
-
-