MovieGQ

O Manasa

Krishna Babu (1999) · Track 6 of 6

Song Details

Lyrics

ఓ... ఓ...ఓ...ఓ... ఓ మనసా ఎదురీతే నేర్చుకో ఓ మనిషి ఎద కోతే ఓర్చుకో గొంతులో గరళాన్ని బంధించు ఈశ్వరుడు గుండెలో బడబాగ్ని దాచుకొను సాగరుడు కలిసిన రూపం నీ వనుకో ఓ... ఓ...ఓ...ఓ... ఓ మనసా ఎదురీతే నేర్చుకో ఓ మనిషి ఎద కోతే ఓర్చుకో పినతల్లి జూదాన ఒక పావుగా నీ వల్ల నీ తండ్రి మరణించినా కారడవిలో దారి కనిపించక చేజేతులా తెలిసి చితిపేర్చిన ఏమి విధి రాతనక రామకథ అనుకో ఏ జన్మ రక్షణకో జన్మ పొందావనుకో నీ వేదనే వేదమై చదువుకో ఓ... ఓ...ఓ...ఓ... ఓ మనసా ఎదురీతే నేర్చుకో ఓ మనిషి ఎద కోతే ఓర్చుకో ఎందరికి ఆశ్రయము కలిపించినా నీ గుండెల్లో చోటింక మిగిలున్నదే అందుకనే కష్టాలు ఎన్నోచ్చినా అవి నీ అందకోరాయి అని నవ్వుకో కొండంత భారాలే సూదంత లనుకుంటూ బంధించు సంకెళ్ళే బంధు జనాలనుకుంటూ ఈ భాదలే బలముగా మార్చుకో ఓ... ఓ...ఓ...ఓ... ఓ మనసా ఎదురీతే నేర్చుకో ఓ మనిషి ఎద కోతే ఓర్చుకో గొంతులో గరళాన్ని బంధించు ఈశ్వరుడు గుండెలో బడబాగ్ని దాచుకొను సాగరుడు కలిసిన రూపం నీ వనుకో ఓ... ఓ...ఓ...ఓ...

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Krishna Babu

See All