Song Details
Lyrics
మనసుకే పుట్టిన చిగురనుకో వయసుకే ఎక్కిన పొగరనుకో కలయికే కమ్మని కల అనుకో కదలికే కౌగిలి కబురనుకో వినవే చెలీ నా వలపుల గుస గుస వెంటే ఉంటా జతగా వింటే తంటా నీ పరుగుల పదనిస వస్తామరీ ఘాటుగా మనసుకే పుట్టిన చిగురనుకో వయసుకే ఎక్కిన పొగరనుకో హే కలయికే కమ్మని కల అనుకో కదలికే కౌగిలి కబురనుకో ఊరించే నీ కళ్ళల్లో ప్రేమకు ఊరు పేరుందంటా చిరునవ్వే నీ చిరునామా దొరికిందీనాడే వసంతమాడే వయస్సే గుభాళించే వయస్సు వచ్చి మనస్సే ఘుమాయించే ఈడొస్తే ఇంతేనమ్మి ఈల పాటలా సంతేనమ్మి ఇద్దరొక్కటై పోదామోలమ్మి ఓ మనసుకే పుట్టిన చిగురనుకో వయసుకే ఎక్కిన పొగరనుకో హే కలయికే కమ్మని కల అనుకో కదలికే కౌగిలి కబురనుకో మనసిచ్చే నీమాటల్లో నాకొక తోడూ నీడుందంటా తొలిప్రేమే జీవితభీమా కుదిరిందీనాడే గులాబి పూలే పెదాలై కలేస్తుంటే సునామి ఈడు సుఖంగా మెలేస్తుంటే ప్రేమిస్తే ఇంతేనయ్యో పెదవిదాటని గొంతేనయ్యో ముద్దులాటకి అంతేలేదయ్యో హా మనసుకే పుట్టిన చిగురనుకో వయసుకే ఎక్కిన పొగరనుకో హా కలయికే కమ్మని కల అనుకో కదలికే కౌగిలి కబురనుకో
Lyrics sourced from public databases. May contain errors.