Song Details
Lyrics
మా ఇంటిలోన మహలక్ష్మి నీవే మా కంట వెలిగే గృహలక్ష్మి నీవే సిరులెన్నో ఉన్న చిరునవ్వు నీవే నీ కంట తడిని నే చూడలేను మా ఇంటిలోన మహలక్ష్మి నీవే గోరంత పసుపు నీవడిగినావు నూరేళ్ళ బ్రతుకు మాకిచ్చినావు క్షణమొక్క ఋణమై పెరిగింది బంధం త్యాగాలమయమై సంసారబంధం నీ చేయి తాకి చివురించె చైత్రం ఈ హస్తవాసే నాకున్న నేస్తం అనురాగ సూత్రం మా ఇంటిలొన మహలక్ష్మి నీవే మా కంట వెలిగే గృహలక్ష్మి నీవే సిరులెన్నో ఉన్న చిరునవ్వు నీవే మీ కంట తడిని నే చూడలేను మా అమ్మ నీవై కనిపించినావు ఈ బొమ్మనెపుడో కదిలించినావు నిను చూడగానే పొంగింది రక్తం కనుచూపులోనే మెరిసింది పాశం నీ కంటి చూపే కార్తీకదీపం దైవాలకన్న దయ ఉన్న రూపం ఈ ఇంటి దీపం మా ఇంటిలోన మహలక్ష్మి నీవే మా కంట వెలిగే గృహలక్ష్మి నీవే సిరులెన్నో ఉన్న చిరునవ్వు నీవే మీ కంట తడిని నే చూడలేను మా ఇంటిలోన మహలక్ష్మి నీవే మా కంట వెలిగే గృహలక్ష్మి నీవే
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Kondaveeti Simham
See AllEe Madhumasamlo Ee Dharahasamlo
S.P. Balasubrahmanyam, P. Susheela
Athamadugu Vaagulona Athakoduko
S.P. Balasubrahmanyam, P. Susheela
Pilla Undhi Pilla Meedha Korikundhi
S.P. Balasubrahmanyam, P. Susheela
Banginapalli Mamidipandu Rangumeedhundhi
S.P. Balasubrahmanyam, P. Susheela
Vanoche Varadhoche Valapalle Vayasocche
S.P. Balasubrahmanyam, P. Susheela
Gothikaada Guntanakka Nakki Chudani
S.P. Balasubrahmanyam, P. Susheela