Song Details
Lyrics
పల్లవి: నన్ను తాకి ఎవ్వరో ఎవ్వరో.. యవ్వనాల నవ్వులో పువ్వులో నన్ను తాకి ఎవ్వరో ఎవ్వరో.. యవ్వనాల నవ్వులో పువ్వులో తడిమేను వొణికింది చలితో.. ఒక పెను వేడి రగిలింది మదిలో నన్ను తాకి ఎవ్వరో ఎవ్వరో.. యవ్వనాల నవ్వులో పువ్వులో చరణం: 1 నింగి నుండి దేవత దిగెనో.. పన్నీటి జల్లు చిలకరించెనో నింగి నుండి దేవత దిగెనో.. పన్నీటి జల్లు చిలకరించెనో చెలి పక్కన ఉంటే.. నే పరవశమౌతా చెలి పక్కన ఉంటే.. నే పరవశమౌతా ఈ చక్కని చుక్క చెక్కిలినొక్కుట ఏమో.. కల ఏమో ఆ..ఆ.. నన్ను తాకి ఎవ్వరో ఎవ్వరో.. యవ్వనాల నవ్వులో పువ్వులో చరణం: 2 దేవలోక సుధలు తెచ్చెనో.. తన తేనెలాంటి మనసు కలిపెనో దేవలోక సుధలు తెచ్చెనో.. తన తేనెలాంటి మనసు కలిపెనో ఆ మధువు తాగితే.. నా మనసు ఊగితే ఆ మధువు తాగితే.. నా మనసు ఊగితే ఈ మధుర.. మధుర.. మధుర భావమేమో.. వలపేమో ఆ..ఆ.. నన్ను తాకి ఎవ్వరో ఎవ్వరో... యవ్వనాల నవ్వులో పువ్వులో తడిమేను వొణికింది చలితో.. ఒక పెనువేడి రగిలింది మదిలో ఆ..ఆ.. నన్ను తాకి ఎవ్వరో ఎవ్వరో... యవ్వనాల నవ్వులో పువ్వులో
Lyrics sourced from public databases. May contain errors.