Song Details
Lyrics
నీ మూగ వీణై మోగేనా నీ రాగ మాలై పాడేనా అనురాగం రాగంగా అభిమానం గీతంగా నే పాడేనా శిలవంటి నీ హృదయంలో శృతి నేను కానా ఓదార్చి నిను లాలించే ఒడి నేను కానా తనకంటూ ఒక మనిషంటూ ఉంటేనే బ్రతుకు నిదురించే నీ హృదయంలో కదలాడే కలనై నీ కంటిలో కన్నీటినై ఉంటాను ఓదార్పునై అలిగావు నీవలిసావు అనురాగం కరువై రగిలావు సెగలెగిసావు బ్రతుకంతా బరువై మేఘాన్నై అనురాగాన్నై చినికాను చినుకై పులకించి నువ్వు చిగురించి పెరగాలి మనసై నీ నవ్వులో నే పువ్వునై పూస్తాను నీ కోసమై
Lyrics sourced from public databases. May contain errors.