MovieGQ

Nuvvu Nuvvu

Khadgam (2002) · Track 4 of 6

Song Details

Lyrics

నువ్వు నువ్వు నువ్వే నువ్వు నువ్వు నువ్వు నువ్వూ నువ్వు నువ్వు నువ్వే నువ్వు నువ్వు నువ్వు నువ్వూ నాలోనే నువ్వు నాతోనే నువ్వు నా చుట్టూ నువ్వు నేనంతా నువ్వు నా పెదవిపైన నువ్వు నా మెడవంపున నువ్వు నా గుండె మీద నువ్వు ఒళ్ళంతా నువ్వు బుగ్గల్లో నువ్వూ ముగ్గల్లే నువ్వు ముద్దెసే నువ్వూ నిద్దర్లో నువ్వూ పొద్దుల్లో నువ్వు ప్రతి నిమిషం నువ్వూ... నువ్వు నువ్వు నువ్వే నువ్వు నువ్వు నువ్వు నువ్వూ చరణం: 1 నా వయసును వేధించే వెచ్చదనం నువ్వు నా మనసును లాలించే చల్లదనం నువ్వు పైటే బరువనిపించే పచ్చిదనం నువ్వు బైట పడాలనిపించే పిచ్చిదనం నువ్వు నా ప్రతి యుద్ధం నువ్వూ నా సైన్యం నువ్వు నా ప్రియ శత్రువు నువ్వూ నువ్వూ మెత్తని ముల్లై గిల్లే తొలి చినుకే నువ్వు నచ్చే కష్టమ్ నువ్వూ నువ్వూ... నువ్వూ... నువ్వు నువ్వే నువ్వు నువ్వు నువ్వు నువ్వూ చరణం: 2 నా సిగ్గును దాచుకునే కౌగిలివే నువ్వు నా వన్నీ దోచుకునే కోరికవే నువ్వు మునిపంటితో నను గిచ్చే నేరానివి నువ్వు నా నడుమును నడిపించే నేస్తానివి నువ్వు తీరని దాహం నువ్వు నా మోహం నువ్వు తప్పని స్నేహం నువ్వూ నువ్వూ తీయని గాయం చేసే అన్యాయం నువ్వు అయినా ఇష్టం నువ్వూ నువ్వూ... నువ్వూ... నువ్వు నువ్వే నువ్వు నువ్వు నువ్వు నువ్వూ మైమరిపిస్తూ నువ్వు మురిపిస్తుంటే నువ్వు నే కోరుకునే నా మరోజన్మ నువ్వు కైపెక్కిస్తూ నువ్వు కవ్విస్తుంటే నువ్వు నాకే తెలియని నా కొత్తపేరు నువ్వు నా అందం నువ్వు ఆనందం నువ్వు నేనంటే నువ్వూ నా పంతం నువ్వు నా సొంతం నువ్వు నా అంతం నువ్వూ... నువ్వు నువ్వు నువ్వే నువ్వు నువ్వు నువ్వు నువ్వూ నువ్వు నువ్వు నువ్వే నువ్వు నువ్వు నువ్వు నువ్వూ

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Khadgam

See All