Song Details
Lyrics
చికి చికి చికి చం చాం చికి చికి చికి చం (4) ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతు ఉంటే భూలోకం నన్ను నిద్దరపుచ్చాలి జాబిల్లి తన వెన్నెలతో నన్ను నిద్దురలేపి రేయంతా తెగ అల్లరి చేయాలి ఏవేవో కొన్ని కళలు ఉన్నాయి అవి రేపోమాపో నిజమవ్వాలి గుండెల్లో కొన్ని ఊహలు ఉన్నాయి అవి లోకంలోన చీకటినంతా తరిమెయ్యలి ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతు ఉంటే భూలోకం నన్ను నిద్దరపుచ్చాలి జాబిల్లి తన వెన్నెలతో నన్ను నిద్దురలేపి రేయంతా తెగ అల్లరి చేయాలి చికి చికి చికి చం చాం చికి చికి చికి చం (4) ఆరారో అని ఈ గాలి నాకే జోలలు పాడాలి ఏలేలో అని గోదారి నాతో ఊసులు ఆడాలి ఇంద్రధనస్సుని ఊయలగా నేను మలచాలి - చం తారలన్ని నాకు హారం కావాలి - చికి చికి చికి చం మబ్బు నుండి జారు జల్లులలో నేను తడవాలి - చం చందమామ నాకు చందనమవ్వాలి - చికి చికి చికి చం రంగులతో కళ్ళాపే చల్లాలి ఆ రంగులనుండి లాలించే ఒక రాగం పుట్టాలి ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతు ఉంటే భూలోకం నన్ను నిద్దరపుచ్చాలి హొయ్ చికి చికి చికి చం చాం చికి చికి చికి చం (2) నా వాడు ఎక్కడున్నా సరే రారాజల్లే నను చేరుకోవాలి నాతో ఉంటూ ఎన్నడైనా సరే పసిపాపల్లె నను చూసుకోవాలి అమ్మలోన ఉన్న కమ్మదనం వెన్నలోన కలిపి నాకు ముద్దు ముద్దు గోరుముద్దలు పెట్టాలి - చికి చికి చికి చం ప్రేమలోన ఉన్న తీయదనం ప్రేమ తోటి కలిపి చిన్న తప్పు చేస్తే నన్ను తీయగ తిట్టాలి - చికి చికి చికి చం ఏనాడూ నా నీడై ఉండాలి ఆ నీడను చూసి ఓటములన్ని పారిపోవాలి హే ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతు ఉంటే భూలోకం నన్ను నిద్దరపుచ్చాలి జాబిల్లి తన వెన్నెలతో నన్ను నిద్దురలేపి రేయంతా తెగ అల్లరి చేయాలి చికి చికి చికి చం చాం చికి చికి చికి చం (4)
Lyrics sourced from public databases. May contain errors.