MovieGQ

Manasu Manasu

Kalisundam Raa (2000) · Track 5 of 7

Lyrics

మనసు మనసు కలిసిపోయే కనులు ఎదలు తడిసిపోయే మూడుతరాల దూరమంతా ముచ్చటైపోయే మనసు మనసు కలిసిపోయే కనులు ఎదలు తడిసిపోయే మూడుతరాల దూరమంతా ముచ్చటైపోయే ఏడు స్వరాల రాగబంధం ముద్దుగా మోగే ఇల్లే స్వర్గమాయే ఎదజల్లే మూగ ప్రేమల్లోన మూడుతరాల దూరమంతా ముచ్చటైపోయే ఏడు స్వరాల రాగబంధం ముద్దుగా మోగే చరణం: 1 కలిగిన కలతలు కరిగిన వేళ కవితలు చెలరేగే మనుషుల మనసులు ఎదిగిన వేళ మమతలు విరబూసే ఊరువాడ ఉయ్యాలూగే ఉషారంతా మాదేలే నింగినేల తాళాలేసే సరాగాలు మాకేలే తాతే మనవడాయే నానమ్మే మనువు ఆడేవేళ అరవై ఏళ్ల కుర్రవాడి ఆశకే పెళ్లి మనసు మనసు కలిసిపోయే కనులు ఎదలు తడిసిపోయే మూడుతరాల దూరమంతా ముచ్చటైపోయే నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో చెప్పటానికి భాష లేదు ఆశే తప్ప నువ్వే నాప్రాణం నువ్వే నా సర్వస్వం నువ్వు లేని ఈ లోకం నాకు శూన్యం చరణం: 2 అరగని అరుగులు అలికిన వేళ అతిథులకాహ్వానం తొలకరి వయసులు కలిసిన వేళ తరగని అభిమానం హోయ్... హోయ్... హోయ్...ఈడు జోడు ఆడేపాడే పదాలన్నీ మావేలే ఏకమైన మా గుండెల్లో శ్రుతి లయ ప్రేమేలే వీరా రాఘవయ్య నీ పేరే నిలుపుకుంటామయ్యా ఇల్లు ఇల్లు ఏకమైన పండగీనాడే మనసు మనసు కలిసిపోయే కనులు ఎదలు తడిసిపోయే మూడుతరాల దూరమంతా ముచ్చటైపోయే ఏడు స్వరాల రాగబంధం ముద్దుగా మోగే ఇల్లే స్వర్గమాయే ఎదజల్లే మూగ ప్రేమల్లోన మూడుతరాల దూరమంతా ముచ్చటైపోయే ఏడు స్వరాల రాగబంధం ముద్దుగా మోగే లల లల లలలా లాలలా లాల లాలలా లల లల లలలా లాలలా లాల లాలలా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Kalisundam Raa

See All