Song Details
Lyrics
పల్లవి: ఏమిటయ్య సరసాలు ఎందుకయ్య జల్సాలు ఏమిటయ్య సరసాలు ఎందుకయ్య జల్సాలు ఓ సోగ్గాడా ఆపవయ్య నీ అల్లరి చిల్లర వేషాలు ఏమిటి పిల్లా నా తప్పు ఔనో కాదో నువు చెప్పు ఏమిటి పిల్లా నా తప్పు ఔనో కాదో నువు చెప్పు అదర గొట్టిన బెదర గొట్టిన వీడిపోదు మన వలపు ఏమిటయ్య సరసాలు ఎందుకయ్య జల్సాలు చరణం: 1 ఒళ్ళు ముద్దగా తడిసిపోయింది చలి చలిగా ఉన్నదిలే ఈ నీలల్లోన ఏముందో సిగ్గేస్తూ ఉన్నదిలే అందులో మజా ఉన్నదిలే అనుభవించితే తెలుసునులే అందులో మజా ఉన్నదిలే అనుభవించితే తెలుసునులే నిందమునిగిన వాళ్లకు మనకు చలి ఏమున్నదిలే ఏమిటయ్య సరసాలు ఎందుకయ్య జల్సాలు ఏమిటి పిల్లా నా తప్పు ఔనో కాదో నువు చెప్పు చరణం: 2 రంగులు మార్చే అబ్బాయిలు చదరంగపుటెత్తులు వేస్తారు మాయలు తెలియని అమ్మాయిలను మైకంలో ముంచేస్తారు ఆడవాల్లిలా అంటారు నాటక మాడుతువుంటారు ఆడవాల్లిలా అంటారు నాటక మాడుతువుంటారు సందుచూసుకొని ఎంతటి వాడినైన ముడేసుకుంటారు ఏమిటయ్య సరసాలు ఎందుకయ్య జల్సాలు హయ్ ఏమిటి పిల్లా నా తప్పు ఔనో కాదో నువు చెప్పు చరణం: 3 అత్తకొడుకని అలుసిస్తే ఈ ఆగడమంతా ఏలా అత్తకొడుకని అలుసిస్తే ఈ ఆగడమంతా ఏలా మావోలిప్పుడు చూశారంటే అబ్బో మిర్చి మసాలా ఓ మామ కూతురమ్మా అందాల ముద్దుగుమ్మా ఓ మామ కూతురమ్మా అందాల ముద్దుగుమ్మా మనకేనాడో రాసినాడు ఆ మాయదారి బ్రహ్మ ఏమిటయ్య సరసాలు ఎందుకయ్య జల్సాలు ఓ సోగ్గాడా ఆపవయ్య నీ అల్లరి చిల్లర వేషాలు ఏమిటి పిల్లా నా తప్పు ఔనో కాదో నువు చెప్పు అదర గొట్టిన బెదర గొట్టిన వీడిపోదు మన వలపు
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Kalam Marindi
See AllPalle Nidhurinchenu
Ghantasala, P. Susheela
Vigrahalanu Prathistinchamani
V. Ramakrishna
O Tolakari Merupula Toli Vaana Chinukula
Ghantasala, P. Susheela
Om Namo Narayanaya
P. Susheela
Mundharunna Chinnadhani Andhamemo
Ghantasala, P. Susheela
Maraledule Ee Kalam Maraledule
Saluri Rajeswara Rao
Chatur Varnyam Maya Srustam (Slokam)
Ghantasala