MovieGQ

Neetho Vunte

Josh (2009) · Track 2 of 9

Song Details

Lyrics

నీతో ఉంటే ఇంకా కొన్నాళ్ళు ఏమౌతాయో ఎదిగిన ఇన్నేళ్ళు నీతో ఉంటే ఇంకా కొన్నాళ్ళు ఏమౌతాయో ఎదిగిన ఇన్నేళ్ళు నిన్నిప్పుడు చూస్తే చాలు చిన్నప్పటి చిలిపి క్షణాలు గుండెల్లో గువ్వల గుంపై వాలు నీతో అడుగేస్తే చాలు మునుముందుకు సాగవు కాళ్ళు ఉంటుందా వెనకకి వెళ్ళే వీలు కాలాన్నే తిప్పేసిందీ లీలా బాల్యాన్నే రప్పించిందీవేళా పెద్దరికాలన్నీ చినబోయేలా పొద్దెరగని మరుపేదో పెరిగేలా నీతో ఉంటే ఇంకా కొన్నాళ్ళు ఏమౌతాయో ఎదిగిన ఇన్నేళ్ళు నిలబడి చూస్తాయే ఆగి లేళ్ళు సెలయేళ్ళు చిత్రంగా నీవైపలా పరుగులు తీస్తాయే లేచి రాళ్ళు రాదార్లు నీలాగా నలువైపులా భూమి అంత నీ పేరంటానికి బొమ్మరిల్లు కాదా సమయమంత నీ తారంగానికి సొమ్మసిల్లి పోదా చేదైనా తీపౌతుందే నీ సంతోషం చూసీ చెడు కూడా చెడుతుందే నీ సావాసాన్ని చేసి చేదైనా తీపౌతుందే నీ సంతోషం చూసి చెడు కూడా చెడుతుందే నీ సావాసాన్ని చేసి నీతో ఉంటే ఇంకా కొన్నాళ్ళు ఏమౌతాయో ఎదిగిన ఇన్నేళ్ళు నువ్వేం చూస్తున్నా ఎంతో వింతల్లే అన్నీ గమనించే ఆశ్చర్యమా యే పనిచేస్తున్నా ఏదో ఘనకార్యం లాగే గర్వించే పసిప్రాయమా చుక్కలన్ని దిగి నీ చూపుల్లో కొలువు ఉండిపోగా చీకటన్నదిక రాలేదే నీ కంటిపాప దాకా ప్రతి పూట పండుగలాగే ఉంటుందనిపించేలా తెలిసేలా నేర్పేటందుకు నువ్వే పాఠశాల ప్రతి పూట పండుగలాగే ఉంటుందనిపించేలా తెలిసేలా నేర్పేటందుకు నువ్వే పాఠశాల నీతో ఉంటే ఇంకా కొన్నాళ్ళు ఏమౌతాయో ఎదిగిన ఇన్నేళ్ళు నిన్నిప్పుడు చూస్తే చాలు చిన్నప్పటి చిలిపి క్షణాలు గుండెల్లో గువ్వల గుంపై వాలు కాలాన్నే తిప్పేసిందీలీలా బాల్యాన్నేరప్పించిందీవేళా పెద్దరికాలన్నీ చినబోయేలా పొద్దెరగని మరుపేదో పెరిగేలా నీతో ఉంటే ఇంకా కొన్నాళ్ళు ఏమౌతాయో ఎదిగిన ఇన్నేళ్ళు

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Josh

See All