Song Details
Lyrics
ఈ రేయి తీయనిది ఈ చిరుగాలి మనసైనది ఈ హాయి మాయనిది ఇంతకు మించి ఏమున్నది ఏవేవో కోరికలు యెదలో ఝుమ్మని అంటున్నవి ఆ కొంటె మల్లికలు అల్లనదాగి వింటున్నవి చరణం: 1 ఓ... వరములా దొరికెనీ పరిచయం నా మనసులో కురిసెనే అమృతం నా నిలువున అలలయే పరవశం నీ చెలిమికే చేయని అంకితం కోరుకునే తీరముగా ఆగెను ఈ నిమిషం ఏవేవో కోరికలు యెదలో ఝుమ్మని అంటున్నవి ఆ కొంటె మల్లికలు అల్లనదాగి వింటున్నవి చరణం: 2 నీ ఊపిరీ వెచ్చగా తగలని నా నుదుటిపై తిలకమై వెలగని నా చూపులే చల్లగా తాకని నీ పెదవిపై నవ్వుగా నిలవనీ ఆశలకే ఆయువుగా మారెను నీ స్నేహం ఈ రేయి తీయనిది ఈ చిరుగాలి మనసైనది ఈ హాయి మాయనిది ఇంతకు మించి ఏమున్నది ఇంతకు మించి ఏమున్నది ఇంతకు మించి ఏమున్నది
Lyrics sourced from public databases. May contain errors.