Song Details
Lyrics
పల్లవి: వేయి దీపాలు నాలోన వెలిగితే అది ఏ రూపం.. నీ ప్రతిరూపం కోటి రాగాలు నా గొంతు పలికితే అది ఏ రాగం.. ఆ అనురాగం.. చరణం: 1 ఈ చీకటి కన్నుల వాకిలిలో.. ఓ.. వెలుగుల ముగ్గులు వేసేదెపుడో ఆ వెలుగుల మంగళవేదికపై.. నా వేణులోలుని చూసేదెపుడో చూడలేని నీ కన్నులకూ.. ఎదురుచూపైనా ఉందొకటి చూడగలిగే నా కన్నులకు.. చుట్టూ ఉన్నది పెనుచీకటి.. వేయి దీపాలు నాలోన వెలిగితే ఏ రూపం.. నీ ప్రతిరూపం కోటి రాగాలు నా గొంతు పలికితే ఏ రాగం.. ఆ అనురాగం.. చరణం: 2 సుడివడిపోయే జీవితనౌక.. కడలితీరం చేరేదెపుడో కలగా తోచే ఆశారేఖ.. నిజమై ఎదురై నిలిచేదెపుడో వేచి ఉన్న నీ హృదయంలో.. రేపటి ఉదయం మెరిసింది వేగిపోయే నా గుండెలో.. గతమే స్మృతిగా మిగిలింది.. వేయి దీపాలు నాలోన వెలిగితే ఏ రూపం.. నీ ప్రతిరూపం కోటి రాగాలు నా గొంతు పలికితే ఏ రాగం.. ఆ అనురాగం..
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Jeevitha Nouka
See AllKararavindhe Na Padhara Vindham (Slokam)
S.P. Balasubrahmanyam
Nandhanandhanudu Yendhovedu
S.P. Balasubrahmanyam, P. Susheela
Challalamme Bhamanoi
P. Susheela
Chilaka Pachhani Cheeralona
S.P. Balasubrahmanyam, P. Susheela
Thummedha Thummedha
P. Susheela
Rachhinchu Rachhinchavamma
Vijayalakshmi
Giliginthalu Paluka Galigithe
P. Susheela