MovieGQ

Ee Jeevana Tharangalalo

Jeevana Tharangalu (1973) · Track 6 of 6

Song Details

Singer
Music Director
Lyricist

Lyrics

పదిమాసాలు మోశావు పిల్లలను బ్రతుకంతా మోశావు బాధలను ఇన్ని మోసిన నిన్ను మోసేవాళ్ళు లేక వెళుతున్నావు పల్లవి : ఈ జీవనతరంగాలలో... ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము... ఎంతవరకీ బంధము చరణం: 1 కడుపు చించుకు పుట్టిందొకరు కాటికి నిన్ను మోసేదొకరు తలకు కొరివి పెట్టేదొకరు ఆపై నీతో వచ్చేదెవరు... ఆపై నీతో వచ్చేదెవరు ఈ జీవనతరంగాలలో... ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము... ఎంతవరకీ బంధము చరణం: 2 మమతే మనిషికి బందిఖానా భయపడి తెంచుకు పారిపోయినా తెలియని పాశం వెంటబడి ఋణం తీర్చుకోమంటుంది తెలియని పాశం వెంటబడి ఋణం తీర్చుకోమంటుంది నీ భుజం మార్చుకోమంటుంది ఈ జీవనతరంగాలలో... ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము... ఎంతవరకీ బంధము చరణం: 3 తాళి కట్టిన మగడు లేడని తరలించుకు పోయే మృత్యువాగదు ఈ కట్టెను కట్టెలు కాల్చక మానవు ఆ కన్నీళ్ళకు చితిమంటలారవు ఈ మంటలు ఆ గుండెను అంటక మానవు ఈ జీవనతరంగాలలో... ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము... ఎంతవరకీ బంధము ఈ జీవనతరంగాలలో...

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Jeevana Tharangalu

See All