MovieGQ

Muddula Maa Babu

Jeevana Jyothi (1975) · Track 1 of 8

Song Details

Lyrics

ష్.. ముద్దుల మా బాబు నిద్దరోతున్నాడు...ష్.. సద్దు చేసారంటె వులికులికి పడతాడు ముద్దుల మా బాబు నిద్దరోతున్నాడు సద్దు చేసారంటె వులికులికి పడతాడు గోపాల కృష్ణయ్య రేపల్లెకు వెలుగు మా చిన్ని కన్నయ్య లోకానికె వెలుగు జుజుజుజుజు జుజుజుజుజు ముద్దుల మా బాబు నిద్దరోతున్నాడు సద్దు చేసారంటె వులికులికి పడతాడు చల్లగా నిదరోయే బాబు నిదురలో మెల్లగ నవ్వుకునే బాబు చల్లగా నిదరోయే బాబు నిదురలో మెల్లగ నవ్వుకునే బాబు ఏమి కలలు కంటున్నాడొ తెలుసా... తెలుసా ఏ జన్మకు ఈ తల్లే కావాలనీ ఈ ఒడిలోనె ఆదమరచి వుండాలనీ జుజుజుజుజు జుజుజుజుజు ముద్దుల మా బాబు నిద్దరోతున్నాడు సద్దు చేసారంటె వులికులికి పడతాడు దేవుడే నా ఎదురుగ నిలబడితే ఏమి కావాలి తల్లీ.. అని అడిగితే దేవుడే నా ఎదురుగ నిలబడితే ఏమి కావాలి తల్లీ.. అని అడిగితే నేనేమని అంటానో తెలుసా...తెలుసా నీ నీడలో నా వాడు పెరగాలనీ నీ నీడలో నా వాడు పెరగాలనీ పెరిగి నీలాగే పేరు తెచ్చుకోవాలని జుజుజుజుజు జుజుజుజుజు ముద్దుల మా బాబు నిద్దరోతున్నాడు సద్దు చేసారంటె వులికులికి పడతాడు గోపాల కృష్ణయ్య రేపల్లెకు వెలుగు మా చిన్ని కన్నయ్య లోకానికె వెలుగు జుజుజుజుజు జుజుజుజుజు

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Jeevana Jyothi

See All