Song Details
Lyrics
పల్లవి: అందమైన మనసులో ఇంత అలజడెందుకో ఎందుకో ఎందుకో ఎందుకో తేలికైన మాటలే పెదవి దాటవెందుకో ఎందుకో ఎందుకో ఎందుకో ఎందుకో అసలెందుకో అడుగెందుకో మొదటిసారి ప్రేమ కలిగినందుకా అందమైన మనసులో ఇంత అలజడెందుకో ఎందుకో ఎందుకో ఎందుకో చరణం: 1 అక్షరాలు రెండే లక్షణాలు ఎన్నోఏమని చెప్పాలి నీతో ఒక్కమాట అయినా తక్కువేమి కాదే ప్రేమకు సాటేదీ లేదే రైలుబండి కూతే సన్నాయి పాట కాగా రెండు మనసులొకటయ్యేనా కోయిలమ్మ పాటే మది మీటుతున్న వేళా కాలి మువ్వ గొంతు కలిపెనా అందమైన మనసులో ఇంత అలజడెందుకో ఎందుకో ఎందుకో ఎందుకో చరణం: 2 ఓర నవ్వుతోనే ఓనమాలు నేర్పి ఒడిలో చేరిందా ప్రేమ కంటి చూపుతోనే కొంటె సైగచేసి కలవరపెడుతోందా ప్రేమ గాలిలాగ వచ్చి ఎదచేరెనేమొ ప్రేమ గాలివాటు కాదేమైనా ఆలయాన దైవం కరుణించి పంపెనమ్మా... అందుకోవె ప్రేమ దీవెన అందమైన మనసులో ఇంత అలజడెందుకో ఎందుకో ఎందుకో ఎందుకో తేలికైన మాటలే పెదవి దాటవెందుకో ఎందుకో ఎందుకో ఎందుకో ఎందుకో అసలెందుకో అడుగెందుకో మొదటిసారి ప్రేమ కలిగినందుకా అందమైన మనసులో ఇంత అలజడెందుకో ఎందుకో ఎందుకో ఎందుకో తేలికైన మాటలే పెదవి దాటవెందుకో ఎందుకో ఎందుకో ఎందుకో..
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Jayam
See AllVeeri Veeri
R.P. Patnaik
Raanu Raanu Antune Sinnadho
Teja, Usha, R.P. Patnaik
Nestama
R.P. Patnaik, Usha
Dushkaram
-
Priyatama Telusuna
R.P. Patnaik, Usha
Jayam
-
Sabbasi
Ravi Varma, Balaji, R.P. Patnaik
Gorantha Deepam
R.P. Patnaik, Gayathri
Evvaru Emanna
R.P. Patnaik, Usha
Prema O Prema
K.K.
Enduko (Female)
Usha