MovieGQ

Veede Veede

Jaya Janaki Nayaka (2017) · Track 6 of 7 · 4:20

Song Details

Lyrics

విల విల విల వాలే పొద్దుకి రంగులు మళ్ళీ ఉదయించేలా భగ భగ భగ సూర్యుడి హేలా జల జల జల జారే కన్నుల గంగా జలముల పరుగాగేలా ధగ ధగ ధగ వీరుడి ఊళా అగ్గి శిఖలలోన చిక్కిన మల్లె మొగ్గ కోసం మంచు కెరటమై దూసుకు వచ్చిన సైనికుడు సైనికుడు కత్తి కొనలలోన చిక్కిన పావురాయి కోసం ప్రాణకవచమై రణముకు వచ్చిన రక్షకుడు రక్షకుడు గుండె లోతులో తెగిన గాయమై తగువు న్యాయమై వచ్చాడు కంచు కోటలో రాకుమారి పెదవంచులపై చిరునవ్వవుతాడు వీడే వీడే నీ తక్షణ రక్షణ లక్ష్యకుడే వీడే వీడే నీ లక్షల సైన్యం వీడే వీడే వీడే నిను హరివిల్లుగ మారుస్తాడే వీడే వీడే నీ బలము బలగం వీడే ఆరేసావో పాతేశావో నీ ధైర్యం వెతికిచ్చే వాడు ఆర్చేసావో కాల్చేసావో నీ కలలన్నీ బ్రతికించే వాడు నువ్వు మరచిన నిన్ను మరవని జ్ఞాపకంగ తిరిగొచ్చాడు నిన్ను వలచిన పడమరంచు కొన అంచున మొలచిన తూరుపు వీడు వీడే వీడే నీ తక్షణ రక్షణ లక్ష్యకుడే వీడే వీడే నీ లక్షల సైన్యం వీడే వీడే వీడే నిను హరివిల్లుగ మారుస్తాడే వీడే వీడే నీ బలము బలగం వీడే ఓ విల విల విల వాలే పొద్దుకి రంగులు మళ్ళీ ఉదయించేలా భగ భగ భగ సూర్యుడి హేలా జల జల జల జారే కన్నుల గంగా జలముల పరుగాగేలా ధగ ధగ ధగ వీరుడి ఊళా ఓ అమ్మ ఒడై ప్రేమందించి నీ హృదయం లాలించే వాడు ఓ బ్రహ్మ ముడై నీ సంకెలని నీ శత్రువుని చేధించే వాడు ముగిసి పోయిన నుదుటి రాతనే మలుపు తిప్పు మొదలవుతాడు సగము వెన్నెల సగము జ్వాలగా రగిలే ప్రేమ వికిరణం వీడు వీడే వీడే నీ తక్షణ రక్షణ లక్ష్యకుడే వీడే వీడే నీ లక్షల సైన్యం వీడే వీడే వీడే నిను హరివిల్లుగ మారుస్తాడే వీడే వీడే నీ బలము బలగం వీడే

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Jaya Janaki Nayaka

See All