Song Details
Lyrics
పల్లవి: మాఘమాస వేళలో.. ఒకనాటి సంధ్యలో.. గొరవంకపై ఓ చిలుకకు గుబులాయెనెందుకో...ఓ... మాఘమాస వేళలో.. ఒకనాటి సంధ్యలో.. గొరవంకపై ఓ చిలుకకు గుబులాయెనెందుకో... చరణం: 1 పెళ్ళిపీఠపైన ఏ రాజు దాపునా... చూపుచూపులోనా నూరేళ్ళ దీవన ఆ సమయమందు నేను... ఆ సమయమందు నేను... ఈ బిడియమోపలేను... గొరవంకపై ఓ చిలుకకు గుబులాయెనెందుకో... మాఘమాస వేళలో.. ఒకనాటి సంధ్యలో.. చరణం: 2 వెన్నెళ్లనడుగు.. మరుమల్లెనడుగు.. ఇల్లాలి మనసే కడు చల్లన... వెన్నెళ్లనడుగు.. మరుమల్లెనడుగు.. ఇల్లాలి మనసే కడు చల్లన... ఈ గుండెనడును.. నిట్టూర్పునడుగు.. ఈ గుండెనడును.. నిట్టూర్పునడుగు.. తొలిరేయి తలపే నులివెచ్చన... తొలిరేయి తలపే నులివెచ్చన... గొరవంకపై ఓ చిలుకకు గుబులాయెనెందుకో... మాఘమాస వేళలో.. ఒకనాటి సంధ్యలో.. చరణం: 3 మా ఊరు తలచుకుంటూ నీతోటి సాగనీ నిన్ను తలచుకుంటూ నా ఊరు చేరనీ ఈ రాకపోకలందే... ఈ రాకపోకలందే... నను రేవు చేరుకోనీ... గొరవంకపై ఓ చిలుకకు గుబులాయెనెందుకో... మాఘమాస వేళలో.. ఒకనాటి సంధ్యలో.. గొరవంకపై ఓ చిలుకకు గుబులాయెనెందుకో...
Lyrics sourced from public databases. May contain errors.