Song Details
Lyrics
పల్లవి: నింగి నేలను ప్రేమిస్తుంది... నేల గాలిని ప్రేమిస్తుంది గాలి పువ్వును ప్రేమిస్తుంది... పువ్వు తుమ్మెదను ప్రేమిస్తుంది అలాగే ఐ లవ్ యూ.... అందుకే ఐ లవ్ యూ తుమ్మెద పువ్వును ప్రేమిస్తుంది... పువ్వు గాలిని ప్రేమిస్తుంది గాలి నేలను ప్రేమిస్తుంది... నేల నింగిని ప్రేమిస్తుంది అలాగే ఐ లవ్ యూ.... అందుకే ఐ లవ్ యూ చరణం: 1 నీలిమబ్బులో లేని మత్తు నీ వాలుకళ్ళలో ఉంది... మెరుపుతీగలో లేని చురుకు నీ మేనివిరుపులో ఉంది... నీలిమబ్బులో లేని మత్తు నీ వాలుకళ్ళలో ఉంది... మెరుపుతీగలో లేని చురుకు నీ మేనివిరుపులో ఉంది... కళ్ళతో నిను తాగేస్తోంటే... కమ్మింది ఆ మత్తు కళ్ళతో నిను తాగేస్తోంటే... కమ్మింది ఆ మత్తు కలలలో నిను కాజేస్తుంటే... కలిగింది ఆ మెరుపు నింగి నేలను ప్రేమిస్తుంది... నేల గాలిని ప్రేమిస్తుంది గాలి పువ్వును ప్రేమిస్తుంది... పువ్వు తుమ్మెదను ప్రేమిస్తుంది అలాగే ఐ లవ్ యూ.... అందుకే ఐ లవ్ యూ చరణం: 2 కవ్వించే నీ అందానికి కలకాలం కావలి కాస్తాను..ఊ నమ్మకుంటే నీ పెదవి అంచుపై కమ్మని బాసలు రాస్తాను కవ్వించే నీ అందానికి కలకాలం కావలి కాస్తాను..ఊ నమ్మకుంటే నీ పెదవి అంచుపై కమ్మని బాసలు రాస్తాను పెదవిపైన రాసిన వ్రాతలు ఎదలో పొదగాలి పెదవిపైన రాసిన వ్రాతలు ఎదలో పొదగాలి ఎన్నడు వీదని జంటగా ఇలాగే నిలవాలి నింగి నేలను ప్రేమిస్తుంది... నేల గాలిని ప్రేమిస్తుంది గాలి పువ్వును ప్రేమిస్తుంది... పువ్వు తుమ్మెదను ప్రేమిస్తుంది అలాగే ఐ లవ్ యూ.... అందుకే ఐ లవ్ యూ అలాగే ఐ లవ్ యూ.... అందుకే ఐ లవ్ యూ ఐ లవ్ యూ.... ఐ లవ్ యూ ఐ లవ్ యూ.... ఐ లవ్ యూ ఐ లవ్ యూ.... ఐ లవ్ యూ
Lyrics sourced from public databases. May contain errors.