MovieGQ

Madhura Bhavala Sumamala

Jai Jawan (1970) · Track 4 of 7

Song Details

Lyrics

మధుర భావాల సుమమాల మనసులో పూచె ఈ వేళ పసిడి కలలేవో చివురించే ప్రణయ రాగాలు పలికించే మధుర భావాల సుమమాల మనసులో పూచె ఈ వేళ ఎదను అలరించు హారములో పొదిగితిరి ఎన్ని పెన్నిధులో ఎదను అలరించు హారములో పొదిగితిరి ఎన్ని పెన్నిధులో మరువరాని మమతలన్నీ మెరిసిపోవాలి కన్నులలో మధుర భావాల సుమమాల మనసులో పూచె ఈ వేళ సిరుల తులతూగు చెలి ఉన్నా కరుణ చిలికేవు నాపైన సిరుల తులతూగు చెలి ఉన్నా కరుణ చిలికేవు నాపైన కలిమికన్నా చెలిమి మిన్న కలవు మణులెన్నో నీలో మధుర భావాల సుమమాల మనసులో పూచె ఈ వేళ ఒకే పధమందు పయనించి ఒకే గమ్యమ్ము ఆశించి ఒకే పధమందు పయనించి ఒకే గమ్యమ్ము ఆశించి ఒకే మనసై ఒకే తనువై ఉదయశిఖరాలు చేరితిమి మధుర భావాల సుమమాల మనసులో పూచె ఈ వేళ పసిడి కలలేవో చివురించే ప్రణయ రాగాలు పలికించే

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Jai Jawan

See All