MovieGQ

Undipo

Ismart Shankar (2019) · Track 5 of 5

Song Details

Lyrics

ఉండిపో ఉండిపో చేతిలో గీతలా ఎప్పుడూ ఉండిపో నుదుటిపై రాతలా ఉండిపో ఉండిపో కళ్ళలో కాంతిలా ఎప్పుడూ ఉండిపో పెదవిపై నవ్వులా నీతోనే నిండిపోయే నా జీవితం వదిలేసి వెల్లనంది ఏ జ్ఞాపకం మనసే మొయ్యలేనంతగా పట్టి కొలవలేనంతలా విప్పి చెప్పలేనంతలా హాయే కమ్ముకుంటుందిగా ఏదో చంటి పిల్లడిలా నేనే తప్పిపోయానుగా నన్నే వెతుకుతూవుండగా నీలో దొరుకుతున్నానుగా ఉండిపో ఉండిపో చేతిలో గీతలా ఎప్పుడూ ఉండిపో నుదుటిపై రాతలా సరికొత్త తడబాటే మారింది అలవాటు లాగ ఇది చెడ్డ అలవాటే వదిలేసి ఒక మాటు రావా మెడవంక తాకుతుంటే మునివేళ్ళతో బిడియాలు పారిపోవా ఎటువైపుకో ఆహా సన్నగా సన్నగా సన్నజాజిలా నవ్వగా ప్రాణం లేచివచ్చిందిగా మళ్ళీ పుట్టినట్టుందిగా ఓహో మెల్లగా మెల్లగా కాటుక కళ్లనే తిప్పగా నేనో రంగులరాట్నమై చుట్టూ తిరుగుతున్నానుగా తల నిమిరి చనుబాత నువుగాని పొలమారుతుంటే అమాటే నిజమైతే ప్రతిసారి పొలమారి పోతా అడగాలిగాని నువ్వు అలవోకగా నా ప్రాణమైన ఇస్తా అడగొచ్చుగా ప్రాణం నీదని నాదని రెండూ వేరుగా లేవుగా ఎపుడో కలుపుకున్నాంకదా విడిపోయి ఉండలేనంతగా ఉందాం అడుగులో అడుగులా నిండా ప్రేమలో గల గల బంధం బిగిసిపోయిందిగా అంతం కాదులే మనకథ

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Ismart Shankar

See All