MovieGQ

Sarigamalu Galagalalu

Idhi Katha Kadhu (1979) · Track 1 of 5

Song Details

Lyrics

సరిగమలూ గలగలలు.. సరిగమలూ గలగలలు ప్రియుడే సంగీతము.. ప్రియురాలె నాట్యము చెలికాలి మువ్వల గల గలలూ చెలి కాలి మువ్వల గల గలలూ చెలికాని మురళిలో... సరిగమలూ గలగలలు.. సరిగమలూ గలగలలు ఆవేశమున్నది ప్రతి కళలో అనుభూతి ఉన్నది ప్రతి హృదిలో ఆవేశమున్నది ప్రతి కళలో అనుభూతి ఉన్నది ప్రతి హృదిలో కదిలీ కదలక కదిలించు కదలికలు కదిలీ కదలక కదిలించు కదలికలు గంగా తరంగాల శృంగార డోలికలు సరిగమలూ గలగలలు.. సరిగమలు గలగలలు ప్రియుడే సంగీతము.. ప్రియురాలె నాట్యము హృదయాలు కలవాలి ఒక శృతిలో బ్రతుకులు నడవాలి ఒక లయలో శృతిలయలొకటైన అనురాగ రాగాలు జతులై జతలైన నవరస భావాలు సరిగమలూ గలగలలు... సరిగమలూ గలగలలు నయనాలు కలిశాయి ఒక చూపులో నాట్యాలు చేశాయి నీ రూపులో నయనాలు కలిశాయి ఒక చూపులో నాట్యాలు చేశాయి నీ రూపులో రాధనై పలకనీ నీ మురళి రవళిలో పాదమై కదలనీ నీ నాట్య సరళిలో సరిగమలు గలగలలు... ప్రియుడే సంగీతము.. ప్రియురాలె నాట్యము ఆహా.. అహహా.. ఆహా.. అహహా ఆహా.. అహహా.. ఆహా.. అహహా ఆహా.. అహహా.. ఆహా.. అహహా ఆహా.. అహహా.. ఆహా.. అహహా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Idhi Katha Kadhu

See All